Page Loader
Bhagavanth Kesari OTT : బాలయ్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి 'భగవంత్ కేసరి'
బాలయ్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి 'భగవంత్ కేసరి'

Bhagavanth Kesari OTT : బాలయ్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి 'భగవంత్ కేసరి'

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 23, 2023
05:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) తాజాగా నటించిన చిత్రం 'భగవంత్ కేసరి'. అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. అక్టోబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా గ్రాండ్‌గా విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా 30 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 140 కోట్లు వసూళ్లు చేసింది. ఇదిలా ఉండగా, ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటిటిలో చూద్దామన్న అభిమానులకు గుడ్ న్యూస్ అందింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు ఓటీటీ స్ట్రీమింగ్‌కు సంబంధించిన వివరాలను అమెజాన్ ప్రైమ్ వెల్లడించింది. భగవంత్ కేసరి (Bhagavanth Kesari) నవంబర్ 24న స్ట్రీమింగ్‌కు తీసుకొస్తున్నట్లు ప్రకటించింది.

Details

బాబీ కొల్లి దర్శకత్వంలో బాలయ్య మూవీ

భగవంత్ కేసరిలో కాజల్ అగర్వాల్ ఫీ మేల్ రోల్‌లో నటించగా, శ్రీలీల కీలక పాత్ర పోషించింది. ఇక బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ విలన్ నటించాడు. ఈ చిత్రాన్ని షైన్‌ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హ‌రీష్ పెద్ది నిర్మించగా.. ఎస్‌ థమన్‌ సంగీతం అందించాడు. ప్రస్తుతం బాలయ్య హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే తొలి షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ, రెండో షెడ్యూల్ ను ఊటీలో చిత్రీకరించనున్నారు.