Daku Maharaj: బాలయ్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఓటీటీలోకి 'డాకు మహారాజ్' వచ్చేస్తోంది
ఈ వార్తాకథనం ఏంటి
నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ చిత్రం ఈ ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.
బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మాస్ ఎంటర్‌టైనర్‌ను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నాగవంశీ నిర్మించారు. మొదటి రోజే మంచి స్పందన అందుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించింది.
మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.56 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి, బాలకృష్ణ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో స్థానం పొందింది.
తాజాగా డాకు మహారాజ్ ఓటీటీ రిలీజ్‌కు సంబంధించి వార్తలు వినిపిస్తున్నాయి.
Details
ఫిబ్రవరి 9న స్ట్రీమింగ్
ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 9 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం. కానీ దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా అందుబాటులో రానుంది. ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటించగా, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్ర పోషించారు.
ఆయనతో పాటు శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా, రిషి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఎస్ఎస్ తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
సంక్రాంతికి విడుదలైన డాకు మహారాజ్ బాక్సాఫీస్ వద్ద రూ.150 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.