Page Loader
OG : ఓజీ రిలీజ్‌పై ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రిలీజ్ డేట్‌పై క్లారిటీ వచ్చేసింది!
ఓజీ రిలీజ్‌పై ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రిలీజ్ డేట్‌పై క్లారిటీ వచ్చేసింది!

OG : ఓజీ రిలీజ్‌పై ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రిలీజ్ డేట్‌పై క్లారిటీ వచ్చేసింది!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 23, 2025
11:01 am

ఈ వార్తాకథనం ఏంటి

పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్‌ అవైటెడ్‌ యాక్షన్ డ్రామా 'ఓజీ' గురించి ఎప్పటికప్పుడు కొత్త అప్‌డేట్స్ వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమా రిలీజ్ డేట్ చుట్టూ పెద్ద చర్చ నడుస్తోంది. ఈ మూవీ ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్ మూవీపై ఇప్పటికే వచ్చిన పాట ఫ్యాన్స్‌లో హై ఎనర్జీ క్రియేట్ చేసింది. పవన్ కళ్యాణ్ పాత్ర కూడా సినిమాపై అంచనాలు పెంచేలా ఉంది. అయితే ఇప్పటివరకు రిలీజ్ డేట్‌ గురించి స్పష్టత ఇవ్వని మూవీ యూనిట్‌.. తాజాగా సెప్టెంబర్ 5 తేదీన థియేటర్లలో సినిమాను విడుదల చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Details

సెప్టెంబర్ 5 రిలీజ్ అయ్యేలా ప్లాన్

ఈ విషయంపై ఇటీవల పవన్‌ స్వయంగా డైరెక్టర్, నిర్మాతలతో చర్చించి, అందుబాటులో ఉన్న పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేసి ఏ విధంగానైనా సినిమా సెప్టెంబర్ 5న రిలీజ్ అయ్యేలా చూసుకోవాలని సూచించారట. ఈ నేపథ్యంలో డైరెక్టర్ సుజీత్ సినిమాపై పూర్తి ఫోకస్ పెట్టినట్టు సమాచారం. మే నెల నుంచి వరుసగా ప్రోమోషనల్ అప్డేట్లు ఇవ్వాలని యూనిట్ ప్లాన్ చేస్తోంది. మేలో పవన్ నటించిన మరో చిత్రం 'హరిహర వీరమల్లు' రిలీజ్ తర్వాత ఓజీపై మరింత ఫోకస్ పెంచనున్నారు. రిలీజ్ దగ్గర పడే సరికి హైప్‌ను మ‌రింత పెంచేలా ప్రమోషన్‌ షురూ చేయనున్నారు. మిగతా ప్రాజెక్టులతో పోలిస్తే దీనిపై అభిమానుల్లో ఎక్కువ అంచనాలున్నాయి.