
Gold prices: పసిడి ప్రేమికులకు గుడ్ న్యూస్.. దేశవ్యాప్తంగా భారీగా తగ్గిన బంగారం ధరలు!
ఈ వార్తాకథనం ఏంటి
గత పదిరోజులుగా ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగిన బంగారం ధరలు ఇవాళ భారీగా తగ్గాయి. దీంతో దేశవ్యాప్తంగా ప్రముఖ నగరాల్లో బంగారం రేట్లలో మార్పు కనిపించింది.
హైదరాబాద్, విజయవాడ
10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 84,000గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 91,640కి చేరింది. నిన్న 22 క్యారెట్ల బంగారం రూ. 500, 24 క్యారెట్ల బంగారం రూ. 540 పెరిగిన విషయం తెలిసిందే.
అయితే ఈ రోజు ఒక్కసారిగా రూ. 1,600 (22 క్యారెట్లకు), రూ. 1,740 (24 క్యారెట్లకు) తగ్గడం గమనార్హం. ఈz ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై వంటి నగరాల్లోనూ అమలులో ఉన్నాయి.
Details
న్యూదిల్లీలో బంగారం రేటు
ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 84,150కి చేరగా, 24 క్యారెట్ల ధర రూ. 91,790 వద్ద ఉంది. నిన్నటి రేట్లతో పోలిస్తే వరుసగా రూ. 1,600, రూ. 1,750 తగ్గాయి.
చెన్నైలోనూ 10 గ్రాముల 22 క్యారెట్ల రేటు రూ. 84,000గా, 24 క్యారెట్ల రేటు రూ. 91,640గా ఉంది. నిన్నటి కంటే వరుసగా రూ. 1,600, రూ. 1,740 తక్కువ.
వెండి రేట్లలో కూడా భారీ మార్పు కనిపించింది. ఈ రోజు కేజీ వెండి ధర రూ. 1,08,000కు చేరింది.
హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై నగరాల్లో ఇదే రేటు కొనసాగగా, ఢిల్లీలో మాత్రం కేజీ వెండి ధర రూ. 99,000కు పడిపోయింది.