Vishvambhara : మెగాఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 'విశ్వంభర' ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ లాక్!
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి 'బోళా శంకర్' సినిమా తర్వాత గ్యాప్ తీసుకుని, ఈసారి పెద్ద హిట్‌తో తిరిగి రావాలని సంకల్పించారు.
అందులో భాగంగా, 'బింబిసార' ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో 'విశ్వంభర' సోషియో ఫాంటసీ సినిమాను చేస్తున్నారు.
ఈ విజువల్ వండర్‌పై మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
విశ్వంభర రిలీజ్‌పై ఆసక్తి
ప్రస్తుతం సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. మొదట సంక్రాంతికి విడుదల చేయాలని భావించినా, షూటింగ్ జాప్యం, వీఎఫ్ఎక్స్ పనుల ఆలస్యంతో రిలీజ్ వాయిదా పడింది.
అయితే కొత్త రిలీజ్ డేట్‌ను మేకర్స్ ఇంకా ప్రకటించలేదు.
Details
ఉగాదికి సాంగ్ రిలీజ్
ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చారని ఆడియో ఆల్బమ్ నెక్ట్స్ లెవెల్‌లో ఉండబోతుందని ఫిల్మ్ నగర్‌లో టాక్ నడుస్తోంది.
ఈ సినిమాలోని పాటలు మెగాఫ్యాన్స్‌ను ఉర్రూతలూగిస్తాయని అంటున్నారు.
మాస్ సాంగ్ స్పెషల్ అట్రాక్షన్
ఇటీవల చిత్ర బృందం ఓ మాస్ సాంగ్‌ను చిత్రీకరించింది. రాముల వారిపై రామ రామ అంటూ సాగే ఈ పాట ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
మరింత హైలైట్ ఏమిటంటే ఈ సాంగ్‌లో హీరో సాయిధరమ్ తేజ్ స్పెషల్ అపీరియన్స్ ఇవ్వనున్నట్లు సమాచారం.
సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఉగాదికి మొదటి పాటను విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సాంగ్ విడుదలతో 'విశ్వంభర'పై ఉన్న హైప్ మరింత పెరిగే అవకాశముంది.