
OG: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఓజీ నుండి ఆసక్తికర అప్డేట్!
ఈ వార్తాకథనం ఏంటి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో అడుగుపెట్టి బిజీగా గడపుతున్నాడు. అయితే రాజకీయాల్లోకి వచ్చిన తరువాత సినిమాలపై తక్కువ సమయాన్ని కేటాయిస్తున్నాయి.
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజలతో ఎక్కువ సమయం గడపటం వల్ల షూటింగ్‌కు విరామం తీసుకున్నాడు.
అయితే ఇటీవల కొంత సమయం కేటాయించి హరిహర్ వీరమల్లు సినిమాను పూర్తి చేశాడు. ఈ చిత్రం జూన్ 12న భారీగా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కొత్త రికార్డులను సృష్టిస్తాడని ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు.
ఇంకా పవన్ చేతుల్లో ఓ మరో సినిమా 'ఓజీ' ఉంది. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
Details
గ్యాంగ్ స్టర్ పాత్రలో పవన్ కళ్యాణ్
'ఓజీ'లో పవన్ షర్ట్ లెస్ ఫైట్ సీన్ చేసే అవకాశాలు ఉన్నాయని గుసగుసలు వస్తున్నాయి. ఈ సీన్ ప్రేక్షకులకు కొత్తగా అనిపించే విధంగా ఉండొచ్చనే చర్చ జరుగుతోంది.
ఈ మూవీ రిలీజ్ డేట్ సెప్టెంబర్ 25న ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం 'ఓజీ' షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. ఇందులో పవన్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నాడు.
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్‌కు మంచి స్పందన లభించింది. ఫ్యాన్స్ ఈ సినిమాను ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు.
Details
సెప్టెంబర్ లో విడుదల చేయడానికి ప్లాన్
'ఓజీ' షూటింగ్ పూర్తయ్యాక వీలైనంత త్వరగా ప్రమోషన్స్ పూర్తి చేసి, సెప్టెంబర్‌లో విడుదల చేయాలని మేకర్స్ యత్నిస్తున్నారు.
ఈ సమయంలో అఖండ 2 సినిమా కూడా రాబోతుంది.
అయితే అఖండ 2 వాయిదా పడితే 'ఓజీ'ని ముందుగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ విషయంపై త్వరలో అధికారిక ప్రకటనలు వెలువడనుంది.