Page Loader
Surya : సూర్య అభిమానులకు శుభవార్త.. 'రెట్రో' ఓటీటీ విడుదల తేదీ లీక్?
సూర్య అభిమానులకు శుభవార్త.. 'రెట్రో' ఓటీటీ విడుదల తేదీ లీక్?

Surya : సూర్య అభిమానులకు శుభవార్త.. 'రెట్రో' ఓటీటీ విడుదల తేదీ లీక్?

వ్రాసిన వారు Jayachandra Akuri
May 18, 2025
10:00 am

ఈ వార్తాకథనం ఏంటి

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం 'రెట్రో' మే 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలకు ముందు భారీ అంచనాలు నెలకొన్నాయి. వరుస పరాజయాలతో సూర్య ఒత్తిడిలో ఉండగా, ప్రతిభావంతుడిగా పేరు తెచ్చుకున్న కార్తీక్ ఈసారి సూర్యకు హిట్ అందిస్తాడనే ఆశలు వ్యక్తమయ్యాయి. టీజర్, ట్రైలర్ ఆకట్టుకోవడంతో ఫ్యాన్స్ ఆశలు పెరిగాయి. థియేటర్లలో అడుగుపెట్టిన 'రెట్రో'కి మొదటి షోకే నెగటివ్ టాక్ వచ్చింది. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ కథా రచన, ట్రీట్‌మెంట్ పరంగా ప్రేక్షకులను మెప్పించలేకపోయినట్టు విమర్శలు వెల్లువెత్తాయి. రెండో భాగంలో సెల్వరాఘవన్ దర్శకత్వంలో వచ్చిన 'యుగానికి ఒక్కడు' స్టైల్ అనుసరించడమే సినిమా ప్రధాన లోపంగా అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

Details

జూన్ 5న స్ట్రీమింగ్?

అయితే నటన పరంగా సూర్య అద్భుతంగా చేశాడు. పూజా హెగ్డే కూడా తొలిసారి డీ గ్లామర్ పాత్రలో మెప్పించింది. అయితే మిగతా పాత్రలు పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయాయి. బలమైన విలన్‌ను క్లైమాక్స్‌లో డమ్మీలా చూపించడమే కాక, ఫాదర్-సన్ మధ్య ఉద్రేకాన్ని మలుపు తిప్పకుండానే ముగించడమే ఆఖరి భాగాన్ని మందగింపచేసిందని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తెలుగులో ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా, తమిళనాడులో మాత్రం మంచి హిట్‌గా నిలిచింది. రూ. 100 కోట్ల వసూళ్లు అందుకోవడం దీనికి ఉదాహరణ. ఇక తాజాగా ఈ సినిమాను ఓటిటిలో విడుదల చేయనున్నట్టు సమాచారం. నెట్‌ఫ్లిక్స్‌ ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకోగా, జూన్ 5 నుంచి స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోందని తెలుస్తోంది.