Adarsha Kutumbam Update: వెంకటేష్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..'ఆదర్శకుటుంబం'పై క్రేజీ రూమర్!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రేక్షకుల మదిలో ఎప్పుడూ కొన్ని సినిమాలు ఎప్పటికీ నిలిచిపోతాయి. అలాంటి చిత్రాల్లో 'నువ్వు నాకు నచ్చావ్', 'మల్లీశ్వరి' ప్రత్యేక స్థానం సంపాదించాయి. ఈ సినిమాలకు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టోరీ రైటర్‌గా పని చేసిన విషయం తెలిసిందే. అందరినీ అలరించిన ఈ సినిమాల తర్వాత, విక్టరీ వెంకటేష్ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్టర్‌గా తెరకెక్కిన చిత్రం 'ఆదర్శకుటుంబం'(House No. 47)ప్రేక్షకుల మదిలో భారీ హైప్ సృష్టిస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాల ప్రభావం, వెంకీ మామా కామెడీ టైమింగ్, గురూజీ అదిరిపోయే డైలాగ్స్ కోసం ప్రేక్షకులు ఎక్కువగా ఎదురుచూస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సుమారు 100కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తుండగా, విక్టరీ వెంకటేష్ సరసన కథానాయికగా శ్రీనిధి శెట్టి నటిస్తుంది.
Details
అన్నపూర్ణ స్టూడియోలో భారీ సెట్
తాజాగా, సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి క్రేజీ రూమర్స్ కూడా జోరుగా ప్రచారం అవుతున్నాయి. ఆ రూమర్ ప్రకారం సినిమా సెకండ్ హాఫ్‌లో ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్, ఫుల్ ఎమోషనల్ సీక్వెన్సెస్ ఉంటాయి. ఈ సీక్వెన్స్‌కి తగ్గట్టుగా, సెకండ్ హాఫ్‌లో వెంకీ మామా పాత్రపై ఓ ఫ్లాష్ బ్యాక్ ప్లాన్ చేశారు. ఈ ఫ్లాష్ బ్యాక్‌ను షూట్ చేయడానికి ప్రస్తుతంలో అన్నపూర్ణ స్టూడియోలో భారీ ఇంటి సెట్ ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ఈ సెట్‌లో కీలకమైన సన్నివేశాలను షూట్ చేయనున్నారని సినీ సర్కిల్‌లో ప్రచారం జరుగుతోంది. 'ఆదర్శకుటుంబం' మధ్యతరగతి కుటుంబ నేపథ్యంలో సాగే చిత్రం కాబట్టి, 2026 వేసవి కానుకగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.