Page Loader
WAR 2 : వార్ 2లో ఎన్టీఆర్ ఎంట్రీకి గూస్‌బంప్స్ గ్యారెంటీ.. నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!
వార్ 2లో ఎన్టీఆర్ ఎంట్రీకి గూస్‌బంప్స్ గ్యారెంటీ.. నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!

WAR 2 : వార్ 2లో ఎన్టీఆర్ ఎంట్రీకి గూస్‌బంప్స్ గ్యారెంటీ.. నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 15, 2025
01:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం వార్ 2. యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తుండగా, అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను ఆగస్టు 14న వరల్డ్ వైడ్ రిలీజ్ చేయనున్నారు. తెలుగులో ఈ సినిమాను ప్రముఖ నిర్మాత సితార నాగవంశీ భారీ ధరకు రైట్స్ దక్కించుకుని విడుదల చేయబోతున్నారు. ఇక వార్ 2 గురించి తాజాగా ఫ్యాన్స్‌ను ఫుల్ ఎగ్జైట్ చేసే అప్‌డేట్ ఇచ్చాడు నాగవంశీ. కింగ్డమ్ ప్రమోషన్స్ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వార్ 2లో ఎన్టీఆర్ ఎంట్రీ అయితే థియేటర్లలో స్క్రీన్లు చిరుగిపోతాయి.

Details

యాక్షన్ సీక్వెన్సులు విలువల్ వండర్స్ లా ఉంటాయి

ఇప్పుడు ఎక్కువగా రివీల్ చేయలేను కానీ ఆ ఎంట్రీకి గూస్‌బంప్స్ గ్యారెంటీ. టైటిల్‌కి తగినట్టే హృతిక్, ఎన్టీఆర్ మధ్య వచ్చే యాక్షన్ సీక్వెన్సులు నిజంగా విజువల్ వండర్స్‌లా ఉంటాయి. ఇద్దరు ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్స్ - నువ్వా నేనా అన్నట్టుగా తలపడతారు. ఆ యాక్షన్ ఎనర్జీకి ఫ్యాన్స్ ఫిదా అవుతారని పేర్కొన్నారు. నాగవంశీ వ్యాఖ్యలతో ఎన్టీఆర్ అభిమానుల్లో ఉత్సాహం పెరిగింది. మరోవైపు వార్ 2 తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ రిలీజ్ కోసం నాగవంశీ భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆగస్టు 14న తెల్లవారుజామునే ఫస్ట్ షోలు వేయించేలా ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో డే 1 భారీ కలెక్షన్లు రాబట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.