తదుపరి వార్తా కథనం
    
     
                                                                                భీమా ఫస్ట్ లుక్: పోలీస్ ఆఫీసర్ గా ఉగ్రరూపంలో గోపీచంద్
                వ్రాసిన వారు
                Sriram Pranateja
            
            
                            
                                    Jun 12, 2023 
                    
                     03:54 pm
                            
                    ఈ వార్తాకథనం ఏంటి
మ్యాచో స్టార్ గోపీచంద్ విజయం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాడు. ఈ మధ్య గోపీచంద్ హీరోగా వచ్చిన సినిమాలు బాక్సాఫీసు వద్ద ప్రభావాన్ని చూపలేకపోయాయి. మొన్నటికి మొన్న వచ్చిన రామబాణం సినిమాకు ప్రేక్షకుల నుండి నెగెటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈరోజు గోపీచంద్ పుట్టినరోజు. ఈ సందర్భంగా తన కొత్త సినిమాను ప్రకటించాడు. భీమా అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాను, కన్నడ దర్శకుడు ఏ హర్ష తెరకెక్కిస్తుండడం విశేషం. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమాను కెకె రాధమోహన్ నిర్మిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో పోలీస్ ఆఫీసర్ గా ఉగ్రరూపంలో కనిపించాడు. రవి బస్రూర్, స్వామి జే గౌడ మ్యూజిక్ అందిసున్నారు
ట్విట్టర్ పోస్ట్ చేయండి
భీమా ఫస్ట్ లుక్
#BHIMAA pic.twitter.com/a4R9gQb6mK
— Gopichand (@YoursGopichand) June 12, 2023