హ్యాపీ బర్త్ డే గోపీచంద్: మ్యాచో స్టార్ కెరీర్ లో గుర్తుండిపోయే సినిమాలు
గోపీచంద్.. హీరోగా ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత విలన్ గా పేరు తెచ్చుకుని మళ్ళీ హీరోగా కొనసాగుతున్న హీరో. గోపీచంద్ మొట్టమొదటి సినిమా తొలివలపు, 2001లో రిలీజైంది. థియేటర్ల దగ్గర ఈ సినిమా నిరాశ పర్చింది. ఆ తర్వాత జయం సినిమాతో విలన్ గా ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం గోపీచంద్ కెరీర్లో గుర్తుండిపోయే సినిమాల గురించి మాట్లాడుకుందాం. యజ్ఞం: గోపీచంద్ కు హీరోగా విజయాన్ని అందించిన మొదటి సినిమా ఇది. ఈ సినిమా తర్వాత మళ్ళీ విలన్ గా ఒక్క సినిమా కూడా చేయలేదు. సమీరా బెనర్జీ హీరోయిన్ గా కనిపించిన ఈ సినిమాను ఏయస్ రవికుమార్ డైరెక్ట్ చేసారు.
బాంబే బ్లడ్ గ్రూపును పరిచయం చేసిన సినిమా
రణం: అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, 2006లో రిలీజైంది. కామ్నా జఠ్మలానీ హీరోయిన్ గా కనిపించిన ఈ సినిమా, బాక్సాఫీసు వద్ద మంచి సక్సెస్ అందుకుంది. ఒక్కడున్నాడు: చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా, ఒక కొత్త కాన్సెప్ట్ తో వచ్చింది. అప్పుల్లో కూరుకుపోయిన తండ్రిని కాపాడటానికి చిక్కుల్లో ఇరుక్కున్న హీరో కథే ఒక్కడున్నాడు. బాంబే బ్లడ్ గ్రూపు గురించి ఈ సినిమా తర్వాతే ఎక్కువ మందికి తెలిసింది. లక్ష్యం: గోపీచంద్, అనుష్క శెట్టి హీరోహీరోయిన్లుగా కనిపించిన ఈ సినిమాను శ్రీవాస్ డైరెక్ట్ చేసారు. జగపతిబాబు, యష్ పాల్ శర్మ, అమిత్ తివారీ, దేవరాజ్ నటించిన ఈ సినిమా, బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్ళను రాబట్టుకుంది.
నిధిని పట్టుకోవడానికి చేసే సాహసం
సాహసం: గోపీచంద్, చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్ లో వచ్చిన రెండవ చిత్రం ఇది. ఇండియా పాకిస్తాన్ విభజన సమయంలో తన తాత పోగొట్టుకున్న బంగారు నిధులను పట్టుకోవడానికి పాకిస్తాన్ వెళ్తాడు గోపీచంద్. అడుగడుగునా సస్పెన్స్ తో నిండిన ఈ సినిమా, గోపీచంద్ కెరీర్ లో గుర్తుండిపోయే సినిమాగా నిలిచిపోయింది. తాప్సీ పన్ను, శక్తి కపూర్, ఆలీ ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు.