
Bhimaa: 'కరుణే చూపని బ్రహ్మరాక్షసుడు'.. గోపీచంద్ 'భీమా' ట్రైలర్ అదుర్స్
ఈ వార్తాకథనం ఏంటి
Bhimaa: చాలా కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరో గోపీచంద్ నుంచి కొత్త సినిమా 'భీమా'.
శనివారం 'భీమా' సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను మైకర్స్ విడుదల చేశారు. ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది.
ఇటీవలే కన్నడలో హిట్టయిన 'వేధా' చిత్రానికి దర్శకత్వం వహించిన ఎ.హర్ష ఈ యాక్షన్ డ్రామాకి దర్శకుడిగా వ్యవహరించారు.
2.31 నిమిషాల నిడివి ఉన్న ట్రైలర్‌లో గోపీచంద్ బాడీ లాంగ్వేజ్, మాకో లుక్స్, డైలాగ్ డెలివరీ అదుర్స్ అనిపించింది.
'శ్రీ మహావిష్ణువు ఆరో అవతారం పరుశురాముడు..' అంటూ సాగే ట్రైలర్ డైలాగ్స్ ఆద్యంతం ఆకట్టుకుంటాయి.
శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవి బస్రూర్ స్వరాలు సమకూరుస్తున్నారు. మార్చి 8న సినిమా విడుదలవుతుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
చిత్ర బృందం ట్వీట్
పరశురాముడి క్షేత్రం కోసం బ్రహ్మరాక్షసుడి రౌద్రం🔥🪓
— BHIMAA (@BhimaaMovie) February 24, 2024
Unleashing @YoursGopichand Mass Rage & Rampage through #BHIMAATrailer💥
- https://t.co/3u1CShmPaG#BHIMAA#BHIMAAonMARCH8th@priya_Bshankar @ImMalvikaSharma @NimmaAHarsha @KKRadhamohan @RaviBasrur @SriSathyaSaiArt… pic.twitter.com/rsCDM25fl6