
Gopichand Viswam: సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో 'విశ్వం'... దమ్ము చూపిస్తున్న మాచోస్టార్ గోపీచంద్
ఈ వార్తాకథనం ఏంటి
ఇటీవల సరైన సక్సెస్ లేక సూపర్ హిట్ కోసం తహతహలాడుతున్న మాచో స్టార్ గోపీచంద్ కు ఇప్పుడు పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి.
గోపీచంద్ (Gopi Chand) హీరోగా చేస్తున్న తాజా భారీ ప్రాజెక్టు విశ్వం (Viswam) ఫస్ట్ లుక్ అండ్ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు అదరగొట్టేస్తుంది.
సామాజిక మాధ్యమాల్లో గోపీచంద్ విశ్వం ఫస్ట్ లుక్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉంది.
ఢీ, వెంకీ, దూకుడు వంటి సూపర్ హిట్ చిత్రాలు రూపొందించిన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ (Director) శ్రీను వైట్ల (Srinu Vaitla) ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ విశ్వం సినిమా టీజర్ నెటిజన్ల మనసును కొల్లగొట్టేస్తోంది.
Srinu Vaitla Viswam
ఇంటెన్స్ లుక్ లో గోపీచంద్
చిత్రాలయ స్టూడియో బేనర్ పై వేణు దోనెపూడి, పీపుల్ మీడియా బేనర్ ఫ్యాక్టరీ పై టీజీ విశ్వప్రసాద్
నిర్మిస్తున్న ఈ విశ్వం సినిమా పూర్తిగా భారీ యాక్షన్ ఎంటర్ టైన్ గా ఫస్ట్ టీజర్ చూస్తుంటేనే తెలిసిపోతోంది.
గోపీచంద్ ఇంతకుముందు భీమా సినిమాతో పలకరించినా అది అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకాదరణ పొందలేకపోయింది.
దర్శకుడు శ్రీను వైట్ల కూడా కొంతకాలంగా హిట్ లేదు.
దీంతో ఇద్దరూ హిట్ కోసం ఈ చిత్రంపై దృష్టిపెట్టినట్లు యాక్షన్ ఎపిసోడ్ చెప్పేస్తోంది.
గోపీచంద్ లుక్ కూడా మంచి ఇంటెన్స్ తో ఉంది.
పెళ్లి మండపంలో వేద మంత్రోచ్ఛారణల మధ్య మెషీన్గన్ ను గిటార్ లా పట్టుకుని గోపీచంద్ ఎంటరై విధ్వంసం చేసేపారేస్తున్న సీన్ ఆడియెన్స్ లో అంచనాలు పెంచేస్తోంది.
Chaithan Bharadwaj Music
మరోస్థాయికి తీసుకెళ్లిన చైతన్ భరధ్వాజ్ స్కోర్
ట్రైలరే ఇలా ఉంటే ఇక సినిమా ఏ రేంజ్ లో ఉంటుందోనని గోపీచంద్ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.
సినిమా కూడా ఇదే స్థాయిలో ఉంటే అటు గోపీచంద్ కు, ఇటు శ్రీను వైట్లకు సూపర్ హిట్ ఖాయమేనంటున్నారు నెటిజన్లు.
కేవీ గుహన్ ఫొటోగ్రఫీ, చైతన్ భరధ్వాజ్ బ్యాగ్రౌండ్ స్కోరింగ్ ఈ ట్రైలర్ ను మరో స్థాయికి తీసుకెళ్లింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
గోపీచంద్ 'విశ్వం' ఫస్ట్ లుక్ అండ్ ట్రైలర్
GOPICHAND - SREENU VAITLA FILM TITLED ‘VISWAM’… #Gopichand32 - which teams actor #Gopichand and director #SreenuVaitla - is titled #Viswam… The makers unveil #ViswamFirstStrike, which offers a glimpse of the film.
— taran adarsh (@taran_adarsh) April 11, 2024
🔗: https://t.co/UPlD9dOy5G
Produced by TG Vishwa Prasad and… pic.twitter.com/U1zqpSHHJ8