LOADING...
Yellamma : ఎల్లమ్మలో హీరోయిన్ ఫిక్స్?.. ప్రేమలు ముద్దుగుమ్మ ఓకే చెప్పిందా?
ఎల్లమ్మలో హీరోయిన్ ఫిక్స్?.. ప్రేమలు ముద్దుగుమ్మ ఓకే చెప్పిందా?

Yellamma : ఎల్లమ్మలో హీరోయిన్ ఫిక్స్?.. ప్రేమలు ముద్దుగుమ్మ ఓకే చెప్పిందా?

వ్రాసిన వారు Moogati Shabari
May 28, 2026
02:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతున్న 'ఎల్లమ్మ' సినిమాకు హీరోయిన్‌గా ఎవరిని ఎంపిక చేస్తారనే అంశంపై చాలా కాలంగా చర్చ జరుగుతోంది. మొదట సాయి పల్లవి పేరు వినిపించగా, ఆ తర్వాత కీర్తి సురేష్, మృణాల్ ఠాకూర్ పేర్లు కూడా ప్రచారంలోకి వచ్చాయి. అయితే ప్రస్తుతం యువ నటి మమితా బైజు పేరు దాదాపు ఖరారైనట్టుగా సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

వివరాలు

తెరపై కొత్త జంట..

ఈ చిత్రంతో సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ హీరోగా పరిచయం అవుతున్నారు. ఆయనకు జోడీగా కొత్త తరహా ముఖాన్ని తీసుకురావాలనే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మమితా బైజును ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. ఈ జంట తెరపై కనిపిస్తే కొత్త కలయికగా మంచి ఆకర్షణ సృష్టిస్తుందని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

వివరాలు

సినీ వర్గాల్లో చర్చ..

'ప్రేమలు', 'డ్యూడ్' వంటి చిత్రాల ద్వారా మమితా బైజు తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. అలాగే ధనుష్ నటించిన 'కర' సినిమాలో కూడా ఆమె నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఆ చిత్రంలో 'సెల్లి' అనే మధ్యతరగతి యువతి పాత్రలో ఆమె నటనకు మంచి ప్రశంసలు లభించాయి. 'కర' సినిమా తర్వాత మమితకు మంచి గుర్తింపు రావడంతో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థల దృష్టిని కూడా ఆకర్షించింది. అదే కారణంగా 'ఎల్లమ్మ' సినిమాలో ఆమెకు అవకాశం దక్కే పరిస్థితి ఏర్పడిందని, దేవిశ్రీ ప్రసాద్ సరసన మమితా బైజు పేరు దాదాపు ఖరారైనట్టేనని సినీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

Advertisement