Page Loader
Grammys Awards: భారత సంతతి సింగర్ చంద్రికా టాండన్‌కు గ్రామీ అవార్డు
భారత సంతతి సింగర్ చంద్రికా టాండన్‌కు గ్రామీ అవార్డు

Grammys Awards: భారత సంతతి సింగర్ చంద్రికా టాండన్‌కు గ్రామీ అవార్డు

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 03, 2025
11:31 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ సంగీత రంగంలో ప్రతిష్టాత్మకంగా ఎప్పుడూ ఎదురుచూసే గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం తాజాగా లాస్‌ ఏంజెలెస్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో ప్రముఖ సంగీత దర్శకులు, గాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా భారత సంతతికి చెందిన అమెరికన్ సింగర్, వ్యాపారవేత్త చంద్రికా టాండన్‌ అవార్డు అందుకున్నారు. ఆమె రూపొందించిన 'త్రివేణి' ఆల్బమ్‌ బెస్ట్‌ న్యూ ఏజ్‌ యాంబియంట్ ఆర్‌ చాంట్ ఆల్బమ్‌గా గ్రామీ అవార్డును గెలుచుకుంది. ఈ విజయాన్ని ఆమె ఆనందంగా స్వీకరించారు. ఈ అవార్డు తనకు ఎంతో ప్రత్యేకమని పేర్కొన్నారు. ఈ అవార్డుకు తనను ఎంపిక చేసిన వారికి ఆమె ధన్యవాదాలు తెలిపారు.

Details

కార్చిచ్చు బాధితులందరికీ సంతాపం తెలిపిన చంద్రిక

ఇది చంద్రికకు రెండో గ్రామీ నామినేషన్‌ కావడం ప్రత్యేకంగా పేర్కొన్నారు. 'ఈ విభాగంలో తనతోపాటు చాలామంది గొప్ప గాయకులు, సంగీత దర్శకులు నామినేట్ అయ్యారని, వారితో కలిసి విజయం అందుకోవడం చాలా ఆనందంగా ఉందని చంద్రిక చెప్పారు. చెన్నైలో పెరిగిన చంద్రిక ప్రస్తుతం విదేశాలలో వ్యాపార వేత్తగా కొనసాగుతున్నారు. ఆమె పెప్సీకో మాజీ సీఈఓ ఇంద్రానూయీకి సోదరి. ఈ వేడుకలో కాలిఫోర్నియాలో జరిగిన కార్చిచ్చు బాధితులందరికీ సంతాపం వ్యక్తం చేశారు. ఆ బీభత్సంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సహాయాన్ని అందించడానికి వేడుక ద్వారా సేకరించిన డబ్బును ఉపయోగించనున్నట్లు స్థానిక పత్రికలు పేర్కొన్నాయి.

Details

దుస్తులు తీసేసి ఫోటోలకు ఫోజులిచ్చిన బియాంక

అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌ మరణం అనంతరం ఆయన రచించిన 'ది లాస్ట్‌ సండేస్‌ ఇన్‌ ప్లేన్స్‌'కు బెస్ట్‌ ఆడియోబుక్‌ నెరేషన్‌ విభాగంలో గ్రామీ అవార్డు లభించింది. ఈ అవార్డు, జిమ్మీ కార్టర్‌ మనవడు జేసన్‌ కార్టర్‌కు ఇచ్చారు. అంతేకాక, ఈ వేడుకలో కాంట్రవర్సీకి దారి తీసిన ఘటన కూడా చోటు చేసుకుంది. అమెరికన్‌ ర్యాపర్‌ కాన్యే వెస్ట్‌, అతని భార్య బియాంకా సెన్సోరి రెడ్‌ కార్పెట్‌పై అసాధారణ ప్రవర్తనతో పబ్లిక్‌ అటెన్షన్‌ను ఆకర్షించారు. బియాంక తన దుస్తులు తీసేసి, ఫొటోలకు పోజులిచ్చింది, దీని వల్ల అక్కడ గందరగోళం ఏర్పడింది.