LOADING...
Peddi Movie: రామ్ చరణ్ మూవీ సెట్స్‌లో గ్రాండ్ సెలబ్రేషన్..'పెద్ది' లుక్ లీక్!
రామ్ చరణ్ మూవీ సెట్స్‌లో గ్రాండ్ సెలబ్రేషన్..'పెద్ది' లుక్ లీక్!

Peddi Movie: రామ్ చరణ్ మూవీ సెట్స్‌లో గ్రాండ్ సెలబ్రేషన్..'పెద్ది' లుక్ లీక్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 10, 2025
01:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ 'పెద్ది' షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన గ్రాండ్ సెట్లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్న చిత్రబృందం, ఈషెడ్యూల్‌లో యాక్షన్ సీక్వెన్స్‌లతో పాటు, ప్రధాన తారాగణంపై పలు ముఖ్యమైన దృశ్యాలను తెరకెక్కిస్తోంది. ఈ క్రమంలో సినిమా సెట్స్‌ నుంచి తాజాగా ఒక ఫోటో బయటకు వచ్చింది. 'పెద్ది' చిత్రబృందంలో పనిచేస్తున్న ఒక సభ్యుడు పుట్టినరోజు సందర్భంగా షూటింగ్ స్పాట్‌లోనే బర్త్‌డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సెలబ్రేషన్స్‌లో రామ్ చరణ్‌తో పాటు హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా పాల్గొన్నారు. వారు కలిసి బర్త్‌డే బాయ్‌తో కేక్ కట్ చేశారు. ఆ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ సృష్టిస్తున్నాయి.

Details

కీలక పాత్రలో శివరాజ్ కుమార్

ఈ భారీ బడ్జెట్ సినిమాకు 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రామ్ చరణ్, జాన్వీ కపూర్‌తో పాటు కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్‌గా ఆస్కార్ అవార్డు విజేత ఏ.ఆర్. రెహమాన్ పని చేస్తున్నారు. సినిమాటోగ్రఫీకి రత్నవేలు, ఆర్ట్ డైరెక్షన్‌కి కొల్లా అవినాష్, ఎడిటింగ్‌కి నవీన్ నూలి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ నటులు జగపతిబాబు, దివ్యేందు భట్టాచార్యలు కూడా ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. వృద్ధి సినిమాస్ సమర్పణలో సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్, టీ-సిరీస్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. 'పెద్ది'పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.