Page Loader
Allu Arjun: కేరళలో గ్రాండ్ గా పుష్ప 2 ఫ్రీ రిలీజ్ వేడుక.. పెద్ద ఎత్తున్న చేరుకుంటున్న అభిమానులు
కేరళలో గ్రాండ్ గా పుష్ప 2 ఫ్రీ రిలీజ్ వేడుక.. పెద్ద ఎత్తున్న చేరుకుంటున్న అభిమానులు

Allu Arjun: కేరళలో గ్రాండ్ గా పుష్ప 2 ఫ్రీ రిలీజ్ వేడుక.. పెద్ద ఎత్తున్న చేరుకుంటున్న అభిమానులు

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 27, 2024
06:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప 2 ప్రమోషన్స్ గట్టిగానే కొనసాగుతున్నాయి. ఇటీవల చెన్నైలో గ్రాండ్ ఈవెంట్ నిర్వహించిన మేకర్స్, ఇప్పుడు మలయాళీ అభిమానుల కోసం కోచ్చిలోని గ్రాండ్ హయత్ హోటల్‌లో మలయాళ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను ఎంతో వైభవంగా ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్ ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానుంది. ఈ వేడుకకు ఇప్పటికే వేలాది మంది అల్లు అర్జున్ అభిమానులు చేరుకున్నారు. పుష్ప 2 మలయాళ ట్రైలర్‌కు విపరీతమైన స్పందన లభించింది. ఇక కిస్సీక్ స్పెషల్ సాంగ్ దేశవ్యాప్తంగా హిట్‌గా నిలిచింది. ఈ పాన్ ఇండియా చిత్రంలో హీరోయిన్‌గా రష్మిక మందాన్నా నటించగా, మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

Details

భారీ స్థాయిలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్

రావు రమేశ్, సునీల్, జగపతిబాబు, అనసూయ వంటి ప్రముఖ నటులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ ఇప్పటికే ట్రెండింగ్‌లో ఉంది. రిలీజ్‌కు ముందే పుష్ప 2 దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం భారీ స్థాయిలో ప్రీ-రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. ఈ చిత్రంపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు.