
Kaantha : దుల్కర్ సల్మాన్ 'కాంతా' టీజర్‌కు గ్రాండ్ రిలీజ్ డేట్ ఫిక్స్!
ఈ వార్తాకథనం ఏంటి
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'కాంతా'. లక్కీ భాస్కర్ వంటి భారీ హిట్ తర్వాత ఈ ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న నేపథ్యంలో ఈసినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రముఖ దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా స్ట్రయిట్ తెలుగు మూవీగా తెరకెక్కుతోంది. దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే ల ఫస్ట్‌లుక్ పోస్టర్లు ప్రేక్షకుల నుండి మంచి స్పందన తెచ్చుకున్నాయి. తాజాగా ఈ చిత్రం నుండి మరో కీలక పాత్రను పరిచయం చేశారు మేకర్స్. ఈచిత్రం కథ 1950ల మద్రాస్ నేపథ్యంలో సాగనుంది. నాటకీయత, ఉత్కంఠ కలగలిపిన థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ కథనంతో దుల్కర్ మరోవైపు పూర్తిగా భిన్నమైన పాత్రలో కనిపించనున్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
Details
నాలుగు బాషల్లో రిలీజ్
ఇది దుల్కర్ కెరీర్‌లో ఓ డిఫరెంట్ ప్రాజెక్ట్‌గా నిలవనుందని బజ్. ఇక ఈ సినిమా టీజర్‌కు సంబంధించిన వివరాలు అధికారికంగా వెల్లడి అయ్యాయి. జూలై 28న అంటే దుల్కర్ సల్మాన్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. ఇప్పటికే టీజర్‌కు సంబంధించిన సెన్సార్ ప్రక్రియ పూర్తయింది. 2.14 నిమిషాల నిడివి ఉన్న ఈ టీజర్‌లో దుల్కర్ మాస్ డైలాగ్స్‌తో పాటు, విభిన్నమైన నటనను హైలైట్ చేయనున్నారు. భారీ స్థాయిలో టీజర్‌ను రూపొందించారని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ పూర్తయి, పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. 'కాంతా' చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.