Page Loader
hari hara veera mallu tickets: పెయిడ్ ప్రీమియర్‌కు గ్రీన్ సిగ్నల్.. 'హరి హర వీరమల్లు' టికెట్ ధరలు భారీగా పెంపు!
పెయిడ్ ప్రీమియర్‌కు గ్రీన్ సిగ్నల్.. 'హరి హర వీరమల్లు' టికెట్ ధరలు భారీగా పెంపు!

hari hara veera mallu tickets: పెయిడ్ ప్రీమియర్‌కు గ్రీన్ సిగ్నల్.. 'హరి హర వీరమల్లు' టికెట్ ధరలు భారీగా పెంపు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 19, 2025
04:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ 'హరి హర వీరమల్లు' (Hari Hara Veera Mallu) జులై 24న పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటించగా, ఏఎం రత్నం నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదల సందర్భంగా టికెట్ ధరలు పెంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతినిచ్చింది. చిత్ర నిర్మాతలు ప్రభుత్వాన్ని అభ్యర్థించగా, సినిమా విడుదలైన తొలి రెండు వారాలకు బదులుగా కేవలం తొలిదశ రోజులకు మాత్రమే టికెట్ ధరలు పెంచుకునేందుకు అవకాశం ఇచ్చింది. జులై 24 నుంచి ఆగస్టు 2 వరకు పెరిగిన ధరలు అమల్లో ఉంటాయి.

Details

టికెట్లను పెంచేందుకు గ్రీన్ సిగ్నల్

సింగిల్ స్క్రీన్ థియేటర్లలో లోయర్ క్లాస్ టికెట్‌పై రూ.100 (జీఎస్టీతో కలిపి), అప్పర్ క్లాస్‌పై రూ.150 (జీఎస్టీతో కలిపి) పెంచుకునే అవకాశం ఇచ్చారు. మల్టీప్లెక్స్‌లలో టికెట్ ధరను రూ.200 (జీఎస్టీతో కలిపి) వరకు పెంచుకునేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక రిలీజ్‌కు ముందు రోజైన జులై 23న బుధవారం రాత్రి 9 గంటలకు పెయిడ్ ప్రీమియర్‌కి కూడా అనుమతి లభించింది. ఈ ప్రీమియర్ టికెట్ ధరను రూ.600 (జీఎస్టీ అదనం)గా నిర్ణయించారు. ఇది ఎంచుకున్న కేంద్రాల్లో మాత్రమే ప్రదర్శించనున్నారు. ఈ సందర్భంగా ఏవైనా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు, పోలీస్ శాఖకు ప్రభుత్వం ప్రత్యేక మార్గనిర్దేశాలు జారీ చేసింది.

Details

త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం

తెలంగాణలోనూ టికెట్ ధరలు పెంచేందుకు నిర్మాతలు ప్రభుత్వాన్ని కోరగా, దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం. చారిత్రక నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రానికి ఆమోదం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్నారు. బెనిఫిట్ షోల విషయంలోనూ తెలంగాణలో తెల్లవారుజామున 4 గంటల షోకు, విడుదలకు ఒకరోజు ముందే స్పెషల్ షోల నిర్వహణకు అవకాశం ఉన్నట్లు సమాచారం.