Allu Arjun : 'పుష్ప 2' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గ్రీన్ సిగ్నల్.. వేడుక ఎక్కడంటే?
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్‌లో అక్టోబరు 28 నుంచి అమల్లో ఉన్న కర్ఫ్యూ నవంబర్ 28తో ముగియనుంది.
ఈ అంక్షల కారణంగా సిటీ పరిధిలో ఏ రకమైన సమావేశాలు, ర్యాలీలకు అనుమతులు లేవు. సినిమా పరిశ్రమ కూడా ఈ ఆంక్షల ప్రభావాన్ని ఎదుర్కొంటోంది.
ఈ క్రమంలో అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న 'పుష్ప 2' ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై అనుమతుల విషయంలో కొంత సందిగ్ధత నెలకొంది.
డిసెంబరు 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న 'పుష్ప 2' ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించేందుకు మైత్రీ మూవీస్ నిర్మాతలు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
Details
యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్ లో ఈవెంట్
మొదట హైదరాబాద్‌లోని ఎల్‌బి స్టేడియంలో ఈ వేడుక కోసం అనుమతులు కోరగా, అదే సమయంలో శ్రేయా ఘోషల్ కాన్సర్ట్ జరుగుతుండటంతో అక్కడ నిర్వహణకు వీలు లేకపోయింది.
దీంతో గచ్చిబౌలి స్టేడియంలో ఈవెంట్ చేయాలని ప్రయత్నించినా, ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదు.
చివరికి యూసఫ్‌గూడా పోలీస్ గ్రౌండ్‌లో ఈ వేడుక నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు.
ఎట్టకేలకు యూసఫ్‌గూడా పోలీస్ గ్రౌండ్‌లో పర్మిషన్ లభించడంతో, నిర్మాతలు వేడుకను భారీ స్థాయిలో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక అభిమానులు ఇప్పటికే ఈ వేడుక కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.