LOADING...
RX 100 Sequel: ఆర్ఎక్స్ 100 సీక్వెల్‌కు గ్రీన్ సిగ్నల్.. కథ, హీరోయిన్ ఓకే కానీ!
ఆర్ఎక్స్ 100 సీక్వెల్‌కు గ్రీన్ సిగ్నల్.. కథ, హీరోయిన్ ఓకే కానీ!

RX 100 Sequel: ఆర్ఎక్స్ 100 సీక్వెల్‌కు గ్రీన్ సిగ్నల్.. కథ, హీరోయిన్ ఓకే కానీ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 23, 2025
11:33 am

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ లో చిన్న సినిమాగా వచ్చి భారీ విజయం సాధించిన చిత్రం 'ఆర్ఎక్స్ 100'. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద అద్భుత విజయాన్ని నమోదు చేసింది. కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్‌ జంటగా నటించిన ఈ సినిమాలో, కథ నేరుగా ప్రేక్షకుల హృదయాల్ని తాకింది. ముఖ్యంగా పాయల్‌ పాత్రను విలన్‌గా చూపించి, దర్శకుడు ఓ నూతన కోణాన్ని అందించాడు. ఈ చిత్రంతో పాయల్‌ ఓవర్‌నైట్ స్టార్‌గా మారింది. రొమాన్స్‌, గ్లామర్‌ కాంబినేషన్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా కథ అసలే నిజజీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా రూపుదిద్దుకుందని ప్రచారం.

Details

ప్రేమ వైఫల్యాన్ని కథగా మార్చిన అజయ్ భూపతి

అప్పట్లో రామ్ గోపాల్ వర్మ తీసిన ఎటాక్ సినిమాలో అజయ్ భూపతి శిష్యుడిగా పని చేస్తుండగా, ఒక యువతి ప్రేమ పేరుతో మోసం చేసిందట. ఆ క్షణాల బాధలో అజయ్, సినిమా పనిపై దృష్టి పెట్టలేకపోయాడు. ఆ సమయంలో ఎవరో అతనికి ఈ బాధను డబ్బుగా మార్చుకో అన్నారట. అదే ప్రేరణతో తన ప్రేమ వైఫల్యాన్ని కథగా మలచుకున్నాడు. ఆర్ఎక్స్ 100 కోసం తొలుత విజయ్ దేవరకొండ, నవీన్ చంద్రలతో సంప్రదింపులు చేసినా వారు అందుబాటులో రాలేదు. చివరకు కార్తికేయను హీరోగా ఎంపిక చేసి సినిమా తెరకెక్కించాడు.

Details

స్వీక్వెల్ పై దృష్టి పెట్టిన డైరక్టర్

ఈ సినిమా ఘనవిజయం సాధించడంతో, ఇప్పుడు అజయ్ భూపతి సీక్వెల్‌పై దృష్టిపెట్టినట్టు సమాచారం. ప్రస్తుతం ఆయన మంగళవారం 2 కథపై పని చేస్తున్నా అదే సమయంలో ఆరెక్స్ 100 సీక్వెల్ కోసం స్క్రిప్ట్‌ రెడీ చేస్తున్నాడట. పాయల్‌ సీక్వెల్‌ కోసం రెడీగా ఉన్నా, కార్తికేయ మాత్రం పెద్దగా ఆసక్తి చూపడం లేదని టాక్. అయితే వీరిద్దరితో మరో కొత్త కథను తెరకెక్కించి దానికి ఆర్ఎక్స్ 100 సీక్వెల్ అని పిలిచినా, ప్రేక్షకుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యే అవకాశాలున్నాయి. ఆర్ఎక్స్ 100 సీక్వెల్‌నేనా, లేక మరో యూనిక్ కథతో రాబోతున్నాడా? అనేది స్పష్టత రావాల్సి ఉంది.