
Samantha: సమంత పెళ్లికి గ్రీన్ సిగ్నల్.. ఆ రెండు నెలలలో ముహూర్తం ఖాయం?
ఈ వార్తాకథనం ఏంటి
స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.
మోడలింగ్‌తో కెరీర్ ప్రారంభించి, 2010లో వచ్చిన 'ఏ మాయ చేశావే' సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ, తొలి సినిమాతోనే ఘన విజయం సాధించి అందరి మనసులు దోచుకుంది.
ఆ తర్వాత ఎన్టీఆర్‌తో బృందావనం, మహేష్ బాబుతో దూకుడు వంటి చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది.
ఇక ఈగ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది వంటి విజయవంతమైన చిత్రాలతో అగ్రనటిగా రాణించింది.
'ఏ మాయ చేశావే' చిత్రంలో నాగచైతన్యతో కలిసి నటించడంతో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి ప్రేమగా మారింది.
Details
ఇటీవల తిరుమలను సందర్శించుకున్న సమంత, రాజ్
ఆ ప్రేమ 2017 అక్టోబర్ 6, 7 తేదీల్లో గోవాలో జరిగిన వివాహానికి దారి తీసింది. హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల్లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.
అయితే వ్యక్తిగత కారణాల వల్ల 2021 అక్టోబర్ 2న వీరిద్దరూ విడిపోయారు. నాగచైతన్య ట్విట్టర్ ద్వారా, సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించారు.
ఇక ఇటీవల నాగచైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఇటీవలే సమంత, రాజ్ నిడుమోరుతో కలిసి తిరుమలను సందర్శించగా, పెళ్లి గాసిప్‌కు మరింత ఊపొచ్చింది. తాజా సమాచారం ప్రకారం మరో రెండు నెలల్లో వీరి పెళ్లి జరగనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Details
మే 9న 'శుభమ్' రిలీజ్
ఈ వివాహం ఇప్పటికే జరగాల్సి ఉండగా నాగచైతన్యతో విడాకుల వ్యవహారం కోర్టులో పెండింగ్‌లో ఉండటం వల్ల వాయిదా పడిందని తెలుస్తోంది.
కోర్టు తీర్పు వచ్చాక వీరి పెళ్లి ఘనంగా జరగనుందని సమాచారం. ఇ
క సమంత నిర్మాతగా వ్యవహరించిన 'శుభమ్' చిత్రం మే 9న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.
వ్యక్తిగత జీవితం, కెరీర్ రెండింట్లోనూ కొత్త అధ్యాయానికి సమంత అడుగుపెడుతున్నట్టే కనిపిస్తోంది.
ఫ్యాన్స్ మాత్రం 'మా సమంతకు ఒక తోడు దొరికింది' అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.