
Prabhas Spirit: 'స్పిరిట్' షూటింగ్‌కి గ్రీన్ సిగ్నల్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కి ఫుల్ ఖుషీ!
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు తన విలక్షణ నటనతో మైలురాళ్లుగా ఎదిగిన స్టార్ హీరో ప్రభాస్ మరోసారి ప్రేక్షకుల మన్ననలు అందించేందుకు సిద్ధమవుతున్నాడు.
'బాహుబలి' సిరీస్ ఘన విజయం సాధించిన తర్వాత పాన్ ఇండియా స్టార్‌గా నిలిచిన ప్రభాస్, వరుసగా భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తూ తన క్రేజ్‌ను మరింత పెంచుకుంటున్నాడు.
'సాహో', 'రాధేశ్యామ్', 'ఆదిపురుష్', 'సలార్', 'కల్కి 2898 ఏ.డి' వంటి విజువల్ ఎఫెక్ట్స్‌తో కూడిన చిత్రాలతో తన స్థాయిని మరింత పెంచుకున్నాడు. ఇటీవల ప్రభాస్ నటిస్తున్న మరో ప్రాజెక్ట్ 'స్పిరిట్' పైన భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ చిత్రానికి 'అర్జున్ రెడ్డి', 'యానిమల్' వంటి హిట్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నాడు.
Details
చెలియా
ఈ సినిమా కోసం తొలిసారిగా ప్రభాస్, సందీప్ కాంబినేషన్ ఏర్పడుతోంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే అభిమానులలో భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి.
'స్పిరిట్' చిత్రం ఒక పవర్‌ఫుల్ పోలీస్ యాక్షన్ డ్రామాగా రూపొందనుంది. ఇప్పటి వరకు ప్రేమకథలు, మాస్ యాక్షన్ మూవీల్లో అలరించిన ప్రభాస్ ఈ సినిమాలో తొలిసారి పోలీస్ గెటప్‌లో కనిపించబోతున్నాడు.
హై ఇంటెన్సిటీ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాలో ఆయన పాత్రపై ఇప్పటివరకు పూర్తిగా రహస్యమే కొనసాగుతోంది.
Details
మెక్సికోలో ఫ్రీ ప్రొడక్షన్ పనులు
ఇప్పటికే మెక్సికోలో ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయిన ఈ సినిమా వచ్చే జూన్ నెలలో రెగ్యులర్ షూటింగ్‌కి వెళ్లనున్నట్లు సమాచారం.
ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్‌గా మారింది. ఫ్యాన్స్ ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న అప్‌డేట్ రావడంతో, వారి లోని ఉత్సాహం మరింత పెరిగింది.
ఇక సినిమాకు సంబంధించి పూర్తి క్యాస్ట్, టెక్నికల్ టీం వివరాలు, స్టోరీ లైన్ వంటి ఆసక్తికర విషయాలు త్వరలో వెలుగులోకి రానున్నాయి.
మరోసారి ప్రభాస్ తన పవర్‌ఫుల్ నటనతో ప్రేక్షకుల మనసులు దోచేందుకు సిద్ధమవుతున్నాడు.