NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Guntur kaaram : 'గుంటూరు కారం' పాటపై నెటిజన్ కామెంట్స్.. నిర్మాత ఏమన్నారంటే
    తదుపరి వార్తా కథనం
    Guntur kaaram : 'గుంటూరు కారం' పాటపై నెటిజన్ కామెంట్స్.. నిర్మాత ఏమన్నారంటే
    నిర్మాత ఏమన్నారంటే

    Guntur kaaram : 'గుంటూరు కారం' పాటపై నెటిజన్ కామెంట్స్.. నిర్మాత ఏమన్నారంటే

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Dec 18, 2023
    01:08 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    'గుంటూరు కారం' పాటల విషయంలో హీరో మహేష్ బాబు అసంతృప్తిగా ఉన్నారని ఓ నెటిజన్‌ ట్వీట్‌ చేయడం దుమారం రేపుతోంది.

    మాస్‌ సాంగ్‌పై మహేశ్‌ బాబు అసంతృప్తి వ్యక్తం చేశారని, దర్శకుడికి, మ్యూజిక్ డైరెక్టర్'కు ఆయన క్లాసు తీసుకున్నారు.

    ప్రస్తుతం దాన్ని రీ వర్క్‌ చేస్తున్నారంటూ ఓ నెటిజన్ కోట్ చేశాడు. దీంతో నిర్మాత నాగవంశీ స్పందించారు.

    మూవీలో మొత్తం 4 పాటలతో పాటు ఒక బిట్‌ సాంగ్‌ ఉందని, ఇప్పటికే 3పాటల షూటింగ్‌ సైతం పూర్తయిందన్నారు.

    మిగిలిన పాట చిత్రీకరణ షెడ్యూల్‌ డిసెంబర్‌ 21 నుంచి ప్రారంభం కానుందన్నారు.

    దీనిపై సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని, పాటల గురించి జరుగుతున్నది ఊహగానాలు మాత్రమేన్నారు.

    DETAILS

    ఇలాంటి ఫేక్ న్యూస్‌లకు వాళ్లు స్పందించరు..

    కేవలం పేరు కోసం, లైకుల కోసం కొందరు ఇలాంటి తప్పుడు సమాచారాలను ప్రచారం చేస్తున్నారన్నారు.

    మహేశ్‌ ఫ్యాన్స్‌ ఇలాంటి వార్తలకు స్పందిస్తారని రూమర్స్‌ సృష్టించే వాళ్లకు తెలుసని, ఇలాంటి ఫేక్ న్యూస్‌లకు చిత్ర బృందం స్పందించట్లేదంటే అవి నిజం కాదన్నారు.

    సూపర్ స్టార్ మహేశ్‌ బాబు - త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'గుంటూరు కారం' నుంచి ఇటీవలే ఓ పాటను విడుదల చేశారు.

    ప్రస్తుతం సినిమా చిత్రీకరణ చివరిదశలో ఉంది. మహేశ్‌ సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి ఆడిపాడనున్నారు.

    జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల చేస్తామని చిత్రనిర్మాణ బృందం ఇప్పటికే స్పష్టం చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    గుంటూరు కారం

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    గుంటూరు కారం

    గుంటూరు కారం: కారం రంగు చీరలో ఘాటు పుట్టిస్తున్న శ్రీలీల  మహేష్ బాబు
    గుంటూరు కారం సినిమా నుండి పూజా హెగ్డే బయటకు వచ్చేస్తోంది? కారణమేంటంటే?  మహేష్ బాబు
    మహేష్ బాబు గుంటూరు కారం నెక్స్ట్ షెడ్యూల్ పై క్లారిటీ: షూటింగ్ ఎక్కడ జరగనుందంటే?  మహేష్ బాబు
    గుంటూరు కారం సినిమాలో హిట్ హీరోయిన్: నో లీక్స్ అంటూ లీక్ చేసిన మీనాక్షి చౌదరి  తెలుగు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025