Guntur Karam: గుంటూరు కారం నుండి మీనాక్షి చౌదరి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
మహేష్ బాబు గుంటూరు కారం సినిమాపై హైప్ పెంచేందుకు మేకర్స్ రోజుకో పోస్టర్ రిలీజ్ చేస్తున్నారు. ఈరోజు,నటి మీనాక్షి చౌదరి ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేశారు. ఈ పోస్టర్‌లో మీనాక్షి చౌదరితో బాటు మహేష్ బాబును కూడా స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నారు. చీర కట్టుకుని, మీనాక్షి పోస్టర్‌లో ఈ అందంగా కనిపిస్తోంది. ఇటీవల, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన చిత్రాలలో ఇద్దరు హీరోయిన్స్ కనిపిస్తున్నారు.గుంటూరు కారం విషయంలో కూడా అదే జరిగింది. స్టార్ యాక్టర్‌తో పాటు మీనాక్షి, శ్రీలీలను తెరపై చూడడటానికి మహేష్ బాబు అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో థియేట్రికల్ ట్రైలర్
జనవరి 6న ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. గుంటూరు కారంలో జగపతి బాబు, రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, రాహుల్ రవీంద్రన్, జయరామ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్. ఇప్పటికే ఈ సినిమానుండి రిలీజ్ అయ్యిన పాటలు ప్రజాదరణ పొందాయి.