Guntur Kaaram: హై ఓల్టేజ్ మాస్ .. 'కుర్చీ మడతపెట్టి' లిరికల్ సాంగ్‌కు సోషల్ మీడియా షేక్
మహేష్ బాబు నటిస్తున్న 'గుంటూరు కారం' మూవీ నుంచి హై ఓల్టేజ్ మాస్ సాంగ్ 'కుర్చీ మడతపెట్టి'ని మేకర్స్ శనివారం విడుదల చేసారు. విడుదలైన కొద్ది సేపటికే ఈ సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ పాటలో శ్రీలీల ఎనర్జీ, సూపర్‌స్టార్‌తో ఆమె కెమిస్ట్రీ అద్భుతంగా ఉన్నాయి. ఈ ప్రత్యేక గీతానికి రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా, సాహితీ చాగంటి, శ్రీకృష్ణ పాడారు. ఈ పాటకు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అందించిన బీట్స్.. జనవరి 12న థియేటర్లలో అభిమానులకు పూనకాలు తెప్పీయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, జగపతి బాబు, జయరామ్, రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిషోర్ నటిస్తున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు.