
Guntur Kaaram : కేరళలో గుంటూరు కారం..చలికాలంలో మలయాళ రాష్ట్రానికి చిత్రబృందం
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కొత్త సినిమా గుంటూరు కారం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.
ఈ మేరకు మరో ప్రదేశంలో చిత్రీకరణ చేసేందుకు దక్షిణాది కేరళ వెళ్లనుంది చిత్ర నిర్మాణ బృందం.
ఇదే సమయంలో ఈ సినిమా 2024 సంక్రాంతికి విడుదలవుతోంది. ఇటీవలే ఏఎన్నార్ వర్చువల్ స్టూడియోలో షూటింగ్ జరుపుకుంటున్నట్లు చిత్రనిర్మాణ బృందం అప్ డేట్ ఇచ్చింది.
మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్'లో వస్తున్న మాస్ ఎంటర్టైనర్ 'గుంటూరు కారం' సంక్రాంతికి విడుదల కానుంది.
మరోవైపు ఈ సినిమా షూట్ శరవేగంగా జరుగుతోందని, ఇందుకు సంబంధించి చిత్రబృందం ఎప్పటికప్పుడు అప్'డేట్లు ఇస్తోంది.
ఇప్పటికే ఇక్కడ ఓ పాట షూటింగ్ జరుగుతోంది. ఈ మేరకు మరో రెండు పాటలు షూటింగ్ జరగాల్సి ఉంది.
DETAILS
డ్యూయేట్ పాటల చిత్రీకరణ కోసమే కేరళ టూర్
ఈ నేపథ్యంలోనే కేరళలోని కొచ్చిన్ ప్రాంతానికి మహేష్ బాబు -శ్రీలీలతో పాటు చిత్ర బృందం వెళ్లనుంది. రెండు డ్యూయేట్ పాటల చిత్రీకరణ కోసమే ఈ టూర్ జరగనున్నట్లు తెలుస్తోంది.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమాల్లో డ్యూయెట్ సాంగ్స్ దాదాపుగా హిట్ అవుతుంటాయి. ఇక సూపర్ స్టార్ మహేష్-శ్రీలీలపై డ్యూయెట్ సాంగ్స్ అంటే అభిమానులకు పూనకాలు లోడింగ్ అని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
హారికహాసిని క్రియేషన్స్ నిర్మాణంలో సాగుతున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే ఫస్ట్ సింగిల్ 'దమ్ మసాలా' రిలీజ్ అయ్యింది.
2024 జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానున్న గుంటూరు కారంలో మహేష్, శ్రీలీలతో పాటు మీనాక్షి చౌదరి, రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు.