Page Loader
Guntur Karam : గూంటూరు కారం మాస్ సాంగ్ ప్రోమో.. 'కుర్చీని మడత పెట్టి' సాంగ్‌లో రఫ్పాడించిన మహేష్ బాబు 

Guntur Karam : గూంటూరు కారం మాస్ సాంగ్ ప్రోమో.. 'కుర్చీని మడత పెట్టి' సాంగ్‌లో రఫ్పాడించిన మహేష్ బాబు 

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 29, 2023
12:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా తెరకెక్కుతున్న 'గుంటూరు కారం' (Guntur Karam) నుంచి ఇప్పటికే రెండు పాటలు విడుదలయ్యాయి. దీంతో ఈ సినిమాపై హైప్ క్రియేట్ చేశారు. ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. జనవరి 12న ఈ మూవీ విడుదల కానుంది. ఈ క్రమంలో గుంటూరు కారం నుంచి ఫ్యాన్స్ కు ఉర్రూతలూగించే అప్డేట్ వచ్చింది. 'కుర్చి మడత పెట్టి' అనే సాంగ్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో మహేష్ బాబు, శ్రీలీల మాస్ స్టెప్పులతో ఇరగదీశారు. ఇక ఫుల్ సాంగ్‌ను న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం రేపు రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ప్రోమోను రిలీజ్ చేసిన చిత్ర యూనిట్