Page Loader
Gutka case: అక్షయ్ కుమార్, షారుక్ ఖాన్, అజయ్ దేవగన్‌కు కేంద్రం నోటీసులు 
Allahabad HC: అక్షయ్ కుమార్, షారుక్ ఖాన్, అజయ్ దేవగన్‌లకు కేంద్రం నోటీసులు

Gutka case: అక్షయ్ కుమార్, షారుక్ ఖాన్, అజయ్ దేవగన్‌కు కేంద్రం నోటీసులు 

వ్రాసిన వారు Stalin
Dec 10, 2023
10:59 am

ఈ వార్తాకథనం ఏంటి

Shah Rukh, Akshay, Ajay issued notice: అక్షయ్ కుమార్, షారుక్ ఖాన్, అజయ్ దేవగన్‌లకు కేంద్రం నోటీసులు జారీ చేసింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం అలహాబాద్ కోర్టు లక్నో బెంచ్‌కు తెలియజేసింది. గుట్కా కంపెనీల ప్రమోషన్ వ్యవహారంలో ఈ నోటీసులు జారీ చేసింది. అయితే గుట్కాల ప్రమోషన్ నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకుంటారని కేంద్రాన్ని అలహాబాద్ హైకోర్టు కోరింది. కేసు తదుపరి విచారణను మే 9, 2024తేదీకి వాయిదా వేసింది. స్థానిక న్యాయవాది మోతీలాల్ దాఖలు చేసిన పిటిషన్‌‌ను విచారించిన జస్టిస్ రాజేష్ సింగ్ చౌహాన్ సింగిల్ బెంచ్ విచారించింది. ఇదే కేసును సుప్రీంకోర్టు కూడా విచారిస్తున్నందున ఈ పిటిషన్‌ను కొట్టివేయాలని కేంద్రం తరఫున వాదించిన న్యాయవాది హైకోర్టుకు తెలిపారు.

కేంద్రం

కేంద్రంపై పిటిషనర్ ధిక్కార వ్యాజ్యం

అక్షయ్ కుమార్, షారూఖ్ ఖాన్, అజయ్ దేవగన్‌లకు కేంద్రం షోకాజ్ నోటీసులు జారీ చేసిందని డిప్యూటీ సొలిసిటర్ జనరల్ ఎస్‌బీ పాండే హైకోర్టుకు తెలియజేశారు. అక్టోబరు 22న కేంద్ర ప్రభుత్వానికి గుట్కాల ప్రమోషన్‌పై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని పిటిషనర్‌ తన వ్యాజ్యంలో పేర్కొన్నారు. దీంతో కేంద్రంపై ధిక్కార వ్యాజ్యం వేసినట్లు పిటిషనర్ వివరించారు. పిటిషన్ విచారణ అనంతరం హైకోర్టు కేంద్ర ప్రభుత్వ క్యాబినెట్ సెక్రటరీకి నోటీసులు పంపింది. అనంతరం స్పందించిన కేంద్రం.. షారూఖ్ ఖాన్, అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్‌లకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.