మహేష్ బాబు 28వ సినిమాకు గుంటూరు కారం టైటిల్: గ్లింప్స్ వీడియోతో అభిమానులకు పూనకాలు
ఈ వార్తాకథనం ఏంటి
సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కే మూవీ టైటిల్ ని రివీల్ చేసారు.
గత రెండు మూడు రోజులుగా వార్తల్లో వస్తున్నట్టుగానే ఈ సినిమాకు గుంటూరు కారం అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు. టైటిల్ ని రివీల్ చేయడంతో పాటు చిన్నపాటి గ్లింప్స్ కూడా వదిలారు.
మాస్ ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ వదిలిన ఈ గ్లింప్స్ వీడియో, అందరినీ అమితంగా ఆకర్షించేలా ఉంది.
స్క్రీన్ మీద ఫైట్ జరుగుతుంటే బ్యాగ్రౌండ్ లో సన్నకర్ర సవ్వా దెబ్బ, బొడ్డురాయి బేటా దెబ్బ రవ్వడ దెబ్బా దవడ అబ్బా అంటూ సాగే పాట ఇంట్రెస్టింగ్ గా ఉంది.
Details
హైలైట్ గా మహేష్ పలికిన డైలాగ్
ఈ మొత్తం గ్లింప్స్ లో మహేష్ బాబు పలికిన డైలాగ్, అభిమానులకు పూనకాలు తెప్పిస్తుంది. ఏందట్టా సూస్తున్నావ్, బీడీ త్రీడీలో కనపడుతుందా అంటూ ఒక రకమైన యాసలో డైలాగ్ ని చెప్పాడు మహేష్.
మాస్ స్ట్రైక్ వస్తుందని ప్రామిస్ చేసినట్టుగానే గుంటూరు కారం అనే టైటిల్ ని రివీల్ చేసి మాస్ గ్లింప్స్ వదిలారు.
ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా కనిపిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్ లో ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.
ఈ సినిమాను 2024 జనవరి 13వ తేదీన రిలీజ్ చేస్తామని చిత్రబృందం ఆల్రెడీ ప్రకటించింది.