Page Loader
GV Prakash: విడిపోయిన మరో సీనీ జంట.. పోస్ట్ వైరల్ 
GV Prakash: విడిపోయిన మరో సీనీ జంట.. పోస్ట్ వైరల్

GV Prakash: విడిపోయిన మరో సీనీ జంట.. పోస్ట్ వైరల్ 

వ్రాసిన వారు Sirish Praharaju
May 14, 2024
10:26 am

ఈ వార్తాకథనం ఏంటి

కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మరో జంట విడాకులు తీసుకుంది. తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు , హీరో జీవి ప్రకాష్..తన భార్య ,గాయని సైంధవికి విడాకులు ఇచ్చారు. వీరికి వివాహమై 11 ఏళ్లు అయింది. ప్రకాష్, సైంధవి తమ 11వ వివాహ వార్షికోత్సవానికి నెల రోజుల ముందు ఈ ప్రకటన చేశారు. 'ఎంతో ఆలోచించాం.. చివరికి విడిపోవాలని నేను,సైంధవి నిర్ణయించుకున్నాం.పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం.మీడియా, స్నేహితులు ,అభిమానులు మా నిర్ణయాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం.. అంటూ జీవి ప్రకాష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రకాష్ 2013లో తన స్కూల్‌మేట్, గాయని సైంధవిని వివాహం చేసుకున్నారు.వారు 2020లో అన్వి అనే కుమార్తెకు తల్లిదండ్రులు అయ్యారు. జివి ప్రకాష్ ఏఆర్ రెహ్మాన్ మేనల్లుడు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

జీవి ప్రకాష్ చేసిన ట్వీట్