
Prakash Raj: 'సగం బాలీవుడ్ అమ్ముడుపోయింది'.. గళం విప్పిన ప్రకాశ్ రాజ్
ఈ వార్తాకథనం ఏంటి
దేశ రాజకీయాలపై తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పే నటుల్లో ప్రకాశ్ రాజ్ ఒకరు.
ఎక్స్ వేదికగా తరచూ ప్రభుత్వ విధానాలపై గళమెత్తే ఆయన, తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని బాలీవుడ్ నటుల మౌనంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వాన్ని ఎదిరించే ధైర్యం సినీ పరిశ్రమలో చాలామందిలో లేదని, ఎందుకంటే వారు అమ్ముడుపోయారనే అభిప్రాయాన్ని ఆయన వెల్లడించారు.
Details
సగం మంది నటులు అమ్ముడయ్యారు
ప్రభుత్వం ఏదైనా సరే.. చర్చలను అణిచేస్తుంది. ఎవరు ఏ విషయంపై మాట్లాడాలో, మౌనంగా ఉండాలో, అది వారివారి నిర్ణయమే.
కానీ వాళ్లకు సినిమాలు తీయడంపై, విడుదలపై స్పష్టమైన అవగాహన ఉండాలి. నిజం చెప్పాలంటే, బాలీవుడ్‌లో సగం మంది నటులు ప్రభుత్వానికి అమ్ముడుపోయారు.
మిగిలినవారికి మాట్లాడే ధైర్యమే లేదు. నా మిత్రుడు ఒకరు నన్ను చూస్తూ చెప్పాడు - 'ప్రకాశ్ రాజ్ నీకు ధైర్యం ఉంది, నువ్వు మాట్లాడగలుగుతున్నావు.
కానీ నాకు అంత ధైర్యం లేదు అని. అతడి స్థితిని నేను అర్థం చేసుకోగలను. కానీ మౌనం కూడా ఓ నేరమే.
నేరం చేసినవారిని చరిత్ర క్షమించొచ్చు.. కానీ మౌనంగా కూర్చున్నవారిని మాత్రం క్షమించదని ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు.
Details
అందుకే అవకాశాలు తగ్గాయి
ప్రస్తుతం బాలీవుడ్ నుంచి తాను వెనక్కు నెట్టబడుతున్న విషయాన్ని ప్రకాశ్ రాజ్ నిజాయితీగా అంగీకరించారు. నిజం ఏమైనా నేను బహిరంగంగా మాట్లాడతాను.
రాజకీయాలపై నా అభిప్రాయాన్ని తుడిచిపెట్టకుండా బయటపెడతాను. ఈ స్థితిలో నాతో కలిసి పని చేస్తే తమకు భవిష్యత్తులో సమస్యలు వస్తాయనే భయం వారికి ఉండవచ్చు.
అందుకే అవకాశాలు తగ్గాయి. అయితే ఈ పరిస్థితులు చూసిన తరువాతే నాకు స్పష్టత వచ్చింది - గళం విప్పాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.