Loading...
Hanu-Man 2: 'హను-మాన్ 2: ది రైజ్ ఆఫ్ వానరాస్'.. మెగా హీరోతో సీక్వెల్ ప్రకటన
'హను-మాన్ 2: ది రైజ్ ఆఫ్ వానరాస్'.. మెగా హీరోతో సీక్వెల్ ప్రకటన

Hanu-Man 2: 'హను-మాన్ 2: ది రైజ్ ఆఫ్ వానరాస్'.. మెగా హీరోతో సీక్వెల్ ప్రకటన

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 21, 2026
03:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన 'హను-మాన్' సినిమాకు సీక్వెల్ విషయంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. మొదటి భాగాన్ని నిర్మించిన ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ, మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ ప్రధాన పాత్రలో 'హను-మాన్ 2' చిత్రాన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాకు 'హను-మాన్ 2: ది రైజ్ ఆఫ్ వానరాస్' అనే టైటిల్‌ను ఖరారు చేసింది. 'ఎక్కడికి పోతావు చిన్నవాడా', 'ఊరు పేరు భైరవకోన' వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న విఐ ఆనంద్ ఈ పాన్ ఇండియా ప్రాజెక్టుకు దర్శకత్వం వహించనున్నారు.

వివరాలు

అనౌన్స్‌మెంట్ పోస్టర్ ప్రత్యేక ఆకర్షణ

ఈ సినిమా ప్రకటన సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ సినీ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. పోస్టర్‌లో కండలు తిరిగిన దేహంతో వైష్ణవ్ తేజ్ వెనక్కి తిరిగి నిలబడి కనిపిస్తున్నారు.

ఒక భారీ హనుమంతుడి తోక ఆయనను ఆకాశంలోకి ఎత్తుతున్నట్లుగా పోస్టర్‌ను రూపొందించారు. కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాను విడుదల చేయనున్నారు.

వివరాలు

'జై హనుమాన్'తో పోటీపై చర్చ

అయితే ఈ ప్రకటన ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. 'హను-మాన్' చిత్రానికి దర్శకత్వం వహించిన ప్రశాంత్ వర్మ ఇప్పటికే రిషబ్ శెట్టి హీరోగా 'జై హనుమాన్' సినిమాను ప్రకటించారు.

మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ నేపథ్యంలో 'హను-మాన్' సీక్వెల్ హక్కులు తమకే ఉన్నాయని భావిస్తున్న ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్, మరో హీరో, దర్శకుడితో 'హను-మాన్ 2'ను ప్రకటించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఇతర నటీనటుల వివరాలను కూడా చిత్రబృందం త్వరలో వెల్లడించనుంది.

ADVERTISEMENT