Page Loader
Hanu-man: ఆ రోజే హను-మాన్ మెగా ప్రీ రిలీజ్ ఈవెంట్ .. ముఖ్య అతిథి ఎవరో తెలుసా?
Hanu-man: ఆ రోజే హను-మాన్ మెగా ప్రీ రిలీజ్ ఈవెంట్ .. ముఖ్య అతిథి ఎవరో తెలుసా?

Hanu-man: ఆ రోజే హను-మాన్ మెగా ప్రీ రిలీజ్ ఈవెంట్ .. ముఖ్య అతిథి ఎవరో తెలుసా?

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 04, 2024
09:27 am

ఈ వార్తాకథనం ఏంటి

తేజ సజ్జ నటించిన హను-మాన్ చిత్రం టీజర్ తో సినీ అభిమానులలో ఆసక్తిని రేకెత్తించింది. ఇటీవలే విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది.గతంలో అ!,జాంబీ రెడ్డి చిత్రాలను రూపొందించిన ప్రశాంత్ వర్మ హను-మాన్ చిత్రానికి దర్శకుడు. జనవరి 7న హైదరాబాద్‌లోని ఎన్‌.కన్వెన్షన్‌ సెంటర్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించనున్నట్లు మేకర్స్‌ వెల్లడించారు. ఈ స్పెషల్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరు అవుతున్నారని మేకర్స్ పోస్టర్‌ ద్వారా ప్రకటించారు. ఈ సందర్భంగా కొత్త ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్టు సమాచారం.అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తుండగా,తేజ సజ్జ సోదరిగా వరలక్ష్మి శరత్‌కుమార్ నటించింది. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై కె నిరంజన్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విలన్ గా వినయ్ రాయ్ నటిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ప్రశాంత్ వర్మ చేసిన ట్వీట్