Page Loader
Hanuman: 'హను-మాన్' ఆల్‌టైమ్ ఇండస్ట్రీ రికార్డ్.. ఆనందంలో దర్శకుడి ట్వీట్ 
'హను-మాన్' ఆల్‌టైమ్ ఇండస్ట్రీ రికార్డ్.. ఆనందంలో దర్శకుడి ట్వీట్

Hanuman: 'హను-మాన్' ఆల్‌టైమ్ ఇండస్ట్రీ రికార్డ్.. ఆనందంలో దర్శకుడి ట్వీట్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 06, 2024
01:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించి,హను-మాన్, ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన తెలుగు సూపర్ హీరో చిత్రం హను-మాన్. తేజ సజ్జ, అమృత అయ్యర్,వరలక్ష్మి శరత్‌కుమార్,రాజ్ దీపక్ శెట్టి, వినయ్ రాయ్‌ ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించారు. సంక్రాంతికి విడుదలై ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ అయిన హనుమాన్ బాక్సాఫీస్ వద్ద అద్భుత ప్రదర్శనతో చరిత్రను తిరగరాస్తోంది. అన్ని అంచనాలను అధిగమిస్తూ, ఈ చిత్రం విడుదలైన 25 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ వసూళ్లలో 300 కోట్ల+ మైలురాయిని దాటింది.

Details 

కొత్త బెంచ్‌మార్క్‌లను సెట్ చేస్తున్న హనుమాన్ 

దీనిపై దర్శకుడు ప్రశాంత్‌ వర్మ X లో పోస్ట్‌ పెట్టారు.''హనుమాన్‌' సినిమాను ఆదరిస్తోన్న ప్రేక్షకులకు ధన్యవాదాలు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు.ఈ చిత్రానికి ఎంతోమంది వారి హృదయాల్లో స్థానం కల్పించారు. ఒక్కసారి కంటే ఎక్కువ సార్లు దీన్ని వీక్షిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆదరిస్తోన్న అందరికీ కృతజ్ఞతలు' అంటూ రాసుకొచ్చారు. ఇప్పటికి ఈ సినిమాకి ప్రేక్షకులు థియేటర్‌లకు పోటెత్తుతున్నారు. విడుదలైన అన్ని కేంద్రాలలో తన అద్భుతమైన రన్‌ను కొనసాగిస్తూ మరియు రోజు రోజుకి కొత్త బెంచ్‌మార్క్‌లను సెట్ చేస్తుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ప్రశాంత్ వర్మ చేసిన ట్వీట్ 

Details 

'హనుమాన్' OTT హక్కులు 

OTT ప్లాట్‌ఫారమ్ 'Zee5' హనుమాన్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను పొందినట్లు సమాచారం. ఓటిటి లో తెలుగుతో పాటు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం,ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్,జపనీస్ వంటి విదేశీ భాషలలో కూడా ఈ చిత్రం విడుదల కానుంది. Zee5లో మార్చి 15న విడుదలయ్యే అవకాశం ఉంది.

Details 

ఈ సినిమాకి సీక్వెల్ గా 'జై హనుమాన్‌' 

ఈ చిత్రానికి సీక్వెల్‌గా 'జై హనుమాన్‌' రానుంది. గత కొన్ని రోజుల క్రితమే ఈ సినిమాకి సంభందించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు ప్రారంభమయ్యాయి. ఈ సినిమాలోని లీడ్ రోల్ కోసం బాలీవుడ్‌ స్టార్‌ హీరోను తీసుకునే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. ఇటీవలే, దర్శకుడు ప్రశాంత్ వర్మ హనుమాన్ పాత్ర గురించి ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ 'ఆన్‌స్క్రీన్‌తో పాటు, ఆఫ్‌ స్క్రీన్‌లోనూ వారి ఇమేజ్‌ సరిపోవాలి. చూడగానే భక్తితో నమస్కారం చేయాలన్న భావన కలగాలి. ఆ జాబితాలో చిరంజీవి సర్‌ కూడా ఉండొచ్చు'' అని అన్నారు. దీంతో ఈ సీక్వెల్‌పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.