Page Loader
HANUMAN : హ‌నుమాన్ సినిమా నుంచి అదిరిపోయే అప్‌డేట్‌.. ఇవాళ మూడో పాట రిలీజ్
హ‌నుమాన్ సినిమా నుంచి అదిరిపోయే అప్‌డేట్‌..ఇవాళ మూడో పాట రిలీజ్

HANUMAN : హ‌నుమాన్ సినిమా నుంచి అదిరిపోయే అప్‌డేట్‌.. ఇవాళ మూడో పాట రిలీజ్

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Nov 28, 2023
01:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ యువ హీరో తేజ సజ్జ న‌టిస్తున్న చిత్రం హ‌నుమాన్‌ నుంచి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి మూడో సింగిల్‌ రిలీజ్ కానుంది. ఈ మేరకు ఇవాళ సాయంత్రం 4.05 గంట‌ల‌కు సినిమాలోని మూడో సింగిల్'ను విడుద‌ల చేయ‌నున్నామని చిత్ర నిర్మాణ బృందం వెల్లడించింది. స‌రికొత్త పోస్ట‌ర్ ద్వారా ఈ విష‌యాన్ని చిత్ర బృందం ప్రకటించింది. ఓ చేతిలో క‌త్తి, మ‌రో చేతిలో గొడ్డ‌లి ప‌ట్టుకుని స‌రికొత్త వేష‌దార‌ణ‌లో వేటాడేందుకు వెళ్తున్న పోస్ట‌ర్‌ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. అమృత అయ్యర్ ఫీ మేల్ లీడ్ రోల్'లో న‌టిస్తున్న సజ్జ ప్రశాంత్ వర్మ ద‌ర్శ‌కత్వంలో రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వ‌రుస‌ అప్‌డేట్‌లు వచ్చాయి.

DETAILS

2024 జ‌న‌వ‌రి 12న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న హనుమాన్ 

ఇటీవ‌లే చిత్ర‌ బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. 2024 జ‌న‌వ‌రి 12న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇంతకుముదే టీజ‌ర్‌ సహా రెండు పాట‌ల‌ను విడుద‌ల చేయ‌గా అపూర్వ స్పంద‌న వ‌చ్చింది.వ‌రలక్ష్మి శరత్ కుమార్‌, వినయ్‌ రాయ్‌, రాజ్ దీపక్‌ శెట్టి, వెన్నెల కిశోర్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై కే.నిరంజన్‌ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.అనుదీప్ దేవ్, హరి గౌర, కృష్ణ సౌరభ్'లు సంయుక్తంగా బాణీలను సమకూరుస్తున్నారు. బారతీయ భాషలు సహా శ్రీలంక, చైనా, జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా,స్పెయిన్,జర్మనీ మొత్తం 11 భాషల్లో మూవీ విడుద‌ల కానుంది. ఆంజనేయుడి వరం వల్ల ఓ కుర్రాడికి వచ్చిన శక్తితో ఆ కుర్రాడు ఎదుర్కొన్న పరిణామాలు ఇందులో చూపించనున్నారు.