
Happy Birthday Bhumika Chawla: ఖుషి హీరోయిన్ గురించి ఎవ్వరికీ తెలియని విషయాలు
ఈ వార్తాకథనం ఏంటి
2000సంవత్సరంలో యువకుడు సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి భూమికా చావ్లా అడుగుపెట్టారు. ఆ తర్వాత 2001సంవత్సరంలో పవన్ కళ్యాణ్ సరసన ఖుషి సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ అందుకున్నారు.
ఈరోజు భూమికా చావ్లా 45వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె కెరీర్లోని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.
4ఏళ్ళు సహజీవనం:
సినిమాల్లో ప్రయత్నిస్తుండగా యోగా క్లాసుల్లో జాయిన్ అయిన భూమికా, అక్కడే ఫ్యూఛర్ హజ్బెండ్ భరత్ ఠాకూర్ ని కలుసుకుంది. వీరిద్దరికీ 2007లో వివాహం జరిగింది. పెళ్ళి కాకముందు వీరిద్దరూ 4ఏళ్ళు సహజీవనం చేసారు.
రీమేక్ చిత్రాలు:
ఖుషి చిత్రంతో తెలుగులో భూమిక మంచి సక్సెస్ అందుకుంది. హిందీలో తేరేనామ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఇవి రెండూ రీమేక్ చిత్రాలే కావడం విశేషం.
Details
నంది అవార్డు అందుకున్న హీరోయిన్
ఖుషి సినిమాలో నటనకు గాను ఉత్తమ నటిగా ఫిలిమ్ ఫేర్ అవార్డును అందుకున్నారు. మిస్సమ్మ (2003) సినిమాకు గాను నంది అవార్డును కైవసం చేసుకున్నారు.
హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే, అనసూయ (2007), సత్యభామ (2007) వంటి మహిళా ప్రాధాన్యమున్న సినిమాల్లో కనిపించారు. అనసూయ సినిమాకు ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డుల్లో నామినేషన్ దక్కించుకున్నారు.
హీరోయిన్ గా సినిమాలు మానేసిన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్నారు. MCA (మిడిల్ క్లాస్ అబ్బాయి), యూ టర్న్, ఇదే మా కథ, సీతారామం చిత్రాల్లో విభిన్న పాత్రల్లో భూమికా చావ్లా కనిపించారు.
హిందీలో MS ధోనీ చిత్రంలో ధోనీ సిస్టర్ పాత్రలో, కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ సినిమాలోనూ నటించారు.