Happy Birthday Dhanush: తెలుగులో అనువాదమైన ధనుష్ చిత్రాల్లో ఖచ్చితంగా చూడాల్సిన సినిమాలు
తమిళ నటుడైన ధనుష్ తెలుగు వారికి పరిచయమే. తెలుగులో ధనుష్ కి మంచి మార్కెట్ ఉందని ఇటీవల డైరెక్టుగా తెలుగులో రిలీజైన సార్ సినిమాతో అందరికీ అర్థమైంది. ఈరోజు ధనుష్ 41వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా తెలుగులో అందుబాటులో ఉన్న ధనుష్ నటించిన సినిమాల గురించి మాట్లాడుకుందాం. రఘువరన్ బీటెక్: నిజానికి ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనుకున్నారు. కానీ కుదరకపోవడంతో డైరెక్టుగా తెలుగులో డబ్ చేసారు. ఈ సినిమా, తెలుగులో మంచి విజయం అందుకుంది. అమ్మ సెంటిమెంట్, బీటెక్ తర్వాత ఉద్యోగం కోసం పడే ఇబ్బందులు మొదలగు వాటికి ప్రతీ ఒక్కరూ కనెక్ట్ అవుతారు.
మధ్యతరగతి జీవితాలను చూపించే సినిమాల్లో ధనుష్
నవ మన్మధుడు: ధనుష్, సమంత జంటగా నటించిన ఈ సినిమా, మధ్య తరగతి యువకుల జీవితాన్ని, కుటుంబ పరిస్థితులను, బంధాల గురించి మాట్లాడుతుంది. వేల్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అమీ జాక్సన్ మరో హీరోయిన్ గా నటించింది. తిరు: మధ్యతరగతి యువకుడి పాత్రలో ధనుష్ ఎక్కువగా కనిపిస్తుంటాడు. మధ్యతరగతి జీవితాలను తెరమీద ఎక్కువగా చూపిన హీరోల్లో ధనుష్ టాప్ లో ఉంటాడు. తిరు సినిమాలోనూ మధ్యతరగతి యువకుడి పాత్రలో ధనుష్ కనిపిస్తాడు. నిత్యామీనన్, ప్రియా భవానీ శంకర్, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు.
జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డును అందించిన అసురన్
సార్: ధనుష్ డైరెక్టుగా తెలుగులో నటించిన మొట్టమొదటి సినిమా ఇది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంయుక్తా మీనన్ హీరోయిన్ గా కనిపించింది. ఈ సినిమాలో లెక్కల మాస్టారుగా ధనుష్ కనిపిస్తాడు. ఇటు తెలుగులోనూ, అటు తమిళంలోనూ ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అసురన్: ఈ సినిమా తెలుగులోకి అనువాదం అవలేదు. వెంకటేష్ హీరోగా నారప్ప అనే టైటిల్ తో రీమేక్ అయ్యింది. వెట్రిమారన్ దర్శకత్వం వహించిన అసురన్ సినిమాలో 20ఏళ్ళ కుర్రాడికి తండ్రిగా ధనుష్ నటించారు. ఈ సినిమాలోని నటనకు జాతీయ పురస్కారాన్ని ధనుష్ గెలుచుకున్నారు.