Happy Birthday Keerthy Suresh: నటనతో పాటు వయొలిన్ వాయించడంలో ప్రావీణ్యం ఉన్న కీర్తి సురేష్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు
కీర్తి సురేష్.. మహానటి సినిమాలో సావిత్రి గా కనిపించి తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. మహానటి సినిమాలో కీర్తి సురేష్ నటనకు గాను జాతీయ ఉత్తమ నటి అవార్డు ఆమెను వరించింది. తెలుగులో నేను శైలజ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఆ తర్వాత మహానటి సినిమాతో ఎనలేని గుర్తింపును తెచ్చుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. నేడు కీర్తి సురేష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె జీవితంలోని కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుందాం. స్టార్ హీరోయిన్ అయిన కీర్తి సురేష్ కు నటనలో మాత్రమే కాకుండా వయొలిన్ వాయించడంలో కూడా ప్రావీణ్యం ఉంది. లాక్ డౌన్ సమయంలో వయోలిన్ పై ప్రాక్టీస్ చేసినట్లు ఆమె చెప్పుకొచ్చింది.
బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్
అంతేకాదు, కీర్తి సురేష్ కి స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టమట. చిన్నప్పటి నుండి ట్రైనింగ్ సెంటర్లో ఈత నేర్చుకుందట. చిన్నప్పుడు పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాల్లో కీర్తి సురేష్ చురుగ్గా పాల్గొనేదట. అయితే చదువును మాత్రం నిర్లక్ష్యం చేసేది కాదట. చదువులో ఎల్లప్పుడూ ముందు వరుసలోనే ఉండేదట. కీర్తి సురేష్ సినిమా కుటుంబానికి చెందిన అమ్మాయి. తన తండ్రి సురేష్ కుమార్, మలయాళ ఇండస్ట్రీలో నిర్మాతగా అనేక సినిమాలు నిర్మించారు. అలాగే తన తల్లి మేనక నటిగా ఎన్నో సినిమాల్లో నటించారు. కీర్తి సురేష్ కూడా చిన్నప్పుడే నటనలోకి ఎంట్రీ ఇచ్చింది. బాలనాటిగా అనేక సినిమాల్లో కీర్తి సురేష్ కనిపించింది.