NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Happy birthday Nagarjuna: అమ్మాయిలకు మన్మధుఢు, అభిమానులకు కింగ్ నాగార్జున పుట్టినరోజు ప్రత్యేక కథనం 
    తదుపరి వార్తా కథనం
    Happy birthday Nagarjuna: అమ్మాయిలకు మన్మధుఢు, అభిమానులకు కింగ్ నాగార్జున పుట్టినరోజు ప్రత్యేక కథనం 
    హ్యాపీ బర్త్ డే నాగార్జున

    Happy birthday Nagarjuna: అమ్మాయిలకు మన్మధుఢు, అభిమానులకు కింగ్ నాగార్జున పుట్టినరోజు ప్రత్యేక కథనం 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Aug 28, 2023
    09:05 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆయన అడుగేస్తే మాస్, ఆయన కన్ను కొడితే క్లాస్, అమ్మాయిలకు మన్మధుడు, అభిమానులకు కింగ్.

    నిన్నే పెళ్లాడతా అంటూ ప్రేక్షకులను ప్రేమ మైకంలో ముంచడంలోనూ, అన్నమయ్యగా భక్తి పారవశ్యంలో మైమరిపించేలా చేయడంలో ఆయన సిద్ధ హస్తుడు.

    ఆయనే కింగ్ నాగార్జున. 2023 ఆగస్టు 29వ తేదీన 64వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు నాగార్జున. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం.

    నాగార్జున తన 8నెలల వయసులోనే అక్కినేని నాగేశ్వర్ రావు నటించిన వెలుగు నీడలు సినిమాలో పసిబాలుడిగా తెరమీద కనిపించారు. ఆ తర్వాత 1967లో సుడిగుండాలు చిత్రంలో బాలనటుడిగా నటించారు.

    Details

    నాగార్జున మొట్టమొదటి హిందీ చిత్రం 

    1986లో హీరోగా విక్రమ్ సినిమాతో తెలుగు సినిమాలోకి ఎంట్రీ ఇచ్చాడు. హిందీలో విజయం సాధించిన హీరో సినిమాకు రీమేక్ గా విక్రమ్ తెరకెక్కింది. విక్రమ్ సినిమా మంచి విజయం అందుకుంది.

    ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసారు నాగార్జున. 1989లో ఆయన నటించిన శివ చిత్రం తెలుగు సినిమా రూపురేఖలను పూర్తిగా మార్చేసింది. శివ సినిమాను హిందీలో కూడా నాగార్జున హీరోగా రీమేక్ చేసారు. నాగార్జునకు ఇదే మొట్టమొదటి హిందీ చిత్రం.

    నాగార్జున కెరీర్లో అన్నమయ్య సినిమా ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుంది. నిన్నే పెళ్లాడతా వంటి రొమాంటిక్ సినిమా తర్వాత అన్నమయ్య సినిమా చేయడం అప్పట్లో సంచలనంగా మారింది.

    ఈ సినిమాలో నాగార్జున నటనకు జాతీయ అవార్డు రావాల్సి ఉండేదని చాలామంది చెబుతుంటారు.

    Details

    భక్తుడిగా నాగార్జున నటనకు ప్రేక్షకుల నీరాజనం 

    దేవుడి పాత్రల్లో నాగార్జున కనిపించిన సినిమాలు ప్రేక్షకులను పెద్దగా అలరించలేదు. కానీ భక్తుడిగా చేసిన అన్నమయ్య, శ్రీరామదాసు చిత్రాలు ప్రేక్షకులను అమితంగా ఆకర్షించాయి.

    హీరోగానే కాకుండా ప్రొడ్యూసర్ గానూ నాగార్జున సినిమాలు తెరకెక్కించారు. చిన్న సినిమాలను కూడా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో అందిస్తుంటారు. ఉయ్యాలా జంపాలా, నిర్మలా కాన్వెంట్, రంగుల రాట్నం చిత్రాలు అలా వచ్చినవే.

    సినిమాల్లో బిజీగా ఉండే అక్కినేని హీరో, టెలివిజన్ లోనూ తనదైన సత్తా చూపించారు. ఆయన హోస్ట్ గా వ్యవహరించిన మీలో ఎవరు కోటీశ్వరుడు ఎంత పెద్ద విజయం అందుకుందో అందరికీ తెలిసిందే.

    Details

    నాగార్జున పాడిన పాటలు 

    అలాగే బిగ్ బాస్ రియాల్టీ షో మూడవ సీజన్ నుండి వరుసగా హోస్ట్ గా వ్యవహరిస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా బిగ్ బాస్ 7 సీజన్ కి హోస్ట్ గా వ్యవహరించనున్నారు.

    మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణంలో సీరియల్స్ కూడా రూపొందించారు.

    మా టీవీలో ప్రసారమయ్యే యువ సీరియల్ లో తాను అతిథిగా నటించారు కూడా. అంతేకాదు, సినిమాల్లో నాగార్జున పాటలు కూడా పాడారు.

    శిరిడి సాయి చిత్రంలో ఒక్కడే దేవుడు, నిర్మలా కాన్వెంట్ చిత్రంలో కొత్త కొత్త భాష, సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలో డిక్క డుం డుం, బంగార్రాజు చిత్రంలో లడ్డుండా పాటల్లో తన గొంతును వినిపించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నాగార్జున
    తెలుగు సినిమా
    సినిమా
    పుట్టినరోజు

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    నాగార్జున

    బిగ్ బాస్ సీజన్ 7 ప్రోమో వచ్చేసింది: స్టైలిష్ లుక్ లో అదరగొడుతున్న నాగార్జున  టెలివిజన్
    టాలీవుడ్ లో రీ రిలీజుల పర్వం: అక్కినేని నాగార్జున మన్మథుడు సినిమా మళ్ళీ విడుదల  తెలుగు సినిమా
    బిగ్‍బాస్- 7కు ముహుర్తం ఖరారు.. ఇప్పటికే భారీ అంచ‌నాలు పెంచిన టీజ‌ర్‌ బిగ్ బాస్ 7

    తెలుగు సినిమా

    భోళాశంకర్ నిర్మాతలకు రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేసిన చిరంజీవి?  భోళాశంకర్
    పల్పిట్ రాక్స్ సందర్శించిన రాజమౌళి: ఫోటోలు వైరల్  రాజమౌళి
    Happy Birthday Bhumika Chawla: ఖుషి హీరోయిన్ గురించి ఎవ్వరికీ తెలియని విషయాలు సినిమా
    న్యూయార్క్ నగర వీధుల్లో సమంత: ఫోటోలు వైరల్  సమంత

    సినిమా

    ఈ వారం సినిమా: థియేటర్లలో రిలీజయ్యే సినిమాల జాబితా ఇదే  తెలుగు సినిమా
    సెల్ఫిష్ యాక్టర్ ఆశిష్ రెడ్డి మూడవ చిత్రం ప్రారంభం: లాంచింగ్ కార్యక్రమానికి విచ్చేసిన అతిరథ మహారథులు  దిల్ రాజు
    బండి సరోజ్ కుమార్ నుండి మొదటి సారి క్లీన్ సినిమా: పరాక్రమం చూపించడానికి వచ్చేస్తున్నాడు  బండి సరోజ్ కుమార్
    రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న స్కంద మూవీ ట్రైలర్ విడుదల ఎప్పుడంటే?  రామ్ పోతినేని

    పుట్టినరోజు

    శ్రీవల్లిగా మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన రష్మిక మందన్న తెలుగు సినిమా
    ఈషా రెబ్బా బర్త్ డే: హిట్ కోసం ఎదురుచూస్తున్న తెలుగమ్మాయి  తెలుగు సినిమా
    సచిన్ బర్త్ డే స్పెషల్ : క్రికెట్ కు నిలువెత్తు రూపం సచిన్ టెండుల్కర్ సచిన్ టెండూల్కర్
    రోహిత్ శర్మ బర్తడే స్పెషల్: రికార్డుల రారాజు హిట్ మ్యాన్  రోహిత్ శర్మ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025