Jr NTR birthday: జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు 'మ్యాన్ ఆఫ్ ది మాస్'
జూనియర్ ఎన్టీఆర్‌ను అభిమానులు ముద్దుగా యంగ్ టైగర్ అని పిలుస్తుంటారు. ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ 41వ పుట్టిన రోజు. ప్రేక్షకుల దృష్టిలో మ్యాన్ ఆఫ్ ది మాస్ గా ఎదిగిన క్రమం ఓ ట్రెండ్ సెట్టర్. ఆయన పేరు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఓ ఇప్పుడు మోత మోగుతోంది. రౌద్రం,బీభత్సం,వీరం, కరుణ, శాంతం,హాస్యం, కలబోస్తే నందమూరి తారక రామారావు జూనియర్ అవుతారు. ఆయన 41వ పుట్టిన రోజు వేడుకల సందర్భంగా ప్రత్యేక కధనం.. 1986లో బాల రామాయణంతో చిత్రరంగం ప్రవేశం చేశారు. సీనియర్ ఎన్టీఆర్ వారసుడు అయి వుండికూడా సినిమా వేషాల కోసం తిరుగుతుండేవారు. అంతకు ముందు ఓ సారి మేజర్ చంద్రకాంత్ షూటింగ్ జరుగుతుండగా తాతను కలవటానికి వెళ్లారు.
"నిన్ను చూడాలని" చిత్రంతో సినీ రంగంలోకి అడుగు
ఆ సమయంలో తారక్ కు మేకప్ వేయమని పెద్దాయన ఎన్టీఆర్ చెప్పారు. కొద్దిసేపటి తర్వాత మేకప్ తో కనిపించిన తారక్ ను చూసి సీనియర్ ఎన్టీఆర్ బాగున్నారు.మంచి నటుడు అవుతారని ఆశీర్వదించారని సినీ పెద్దలు చెపుతారు. ఆ తర్వాత కొన్నాళ్లకు "నిన్ను చూడాలని" చిత్రంతో సినీ రంగంలోకి అడుగు పెట్టారు తారక్. ఆ సినిమా పెద్దగా విజయం సాధించలేదు. 2011 సంవత్సరం తారక్ కు గోల్డెన్ పిరియడ్ ఈ తరుణంలో దర్శకులు ఎస్.ఎస్. రాజమౌళి తన తొలి చిత్రంగా "స్డూడెంట్ నెంబర్ 1" తెరకెక్కించారు.ఈ మూవీ పెద్ద హిట్ అయింది. ఇంచు మించు సీనియర్ ఎన్టీఆర్ పోలికలు కలిగి వుండటం,డైలాగ్ డెలివరీ పవర్ ఫుల్ గా ఉండటం తారక్ కు కలిసి వచ్చింది.
"ఆది "బంపర్ హిట్
ఆ తర్వాత వచ్చిన "సుబ్బు" ఫెయిల్ అయింది. మరో కొత్త దర్శకులు వి.వి. వినాయక్ "ఆది " కధను యంగ్ టైగర్ కు వినిపించారు. కధ బాగుంది చేద్దామన్నారు. అప్పటికి తారక్ ఇంకా నూనూగు మీసాల కుర్రాడే .ఐనప్పటికీ రాయలసీమ ఫ్యాక్షన్ కథతో తీసిన "ఆది "బంపర్ హిట్ అయింది. 2011 సంవత్సరం తారక్ కు గోల్డెన్ పిరియడ్ గా చెప్పాలి. అదే ఏడాది ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన "సింహాద్రి " మూవీ .. పెద్ద హీరోల సినిమాలకు ధీటుగా నిలిచింది.
వరుస ఫ్లాప్ లతో ఫ్యాన్స్ లో నిరాశ.. "టెంపర్" తో మళ్లీ..
ఆంధ్రావాలా, సాంబ, నా అల్లుడు, నరసింహుడు చిత్రాలు పెద్దగా మెప్పించలేదు. ఈ వరుస ఫ్లాప్ ల తర్వాత ఎస్.ఎస్. రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన యమదొంగ టాలీవుడ్ ను ఓ ఊపు ఊపిందనే చెప్పాలి. ఈ మూవీలో దొంగగా , యముడిగా నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఆ తర్వాత కంత్రీ, ఊసరవెల్లి, దమ్ము, బాద్ షా , రామయ్య వస్తావయ్యా వంటి ఫ్లాప్ లతో అభిమానులు నిరాశ చెందారు. ఈ సమయంలోనే దర్శకుడు పూరీ జగన్నాధ్ తెరకెక్కించిన "టెంపర్" తో మళ్లీ తారక్ హిట్ ట్రాక్ లోకి పడ్డారు.
RRR కు మూడేళ్ల డెడికేషన్
ఆ తర్వాత నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ,అరవింద సమేతతో మంచి ట్రాక్ లో పడ్డారు. రాజమౌళి డైరెక్షన్ లో మూడేళ్ల పాటు రూపుదిద్దుకున్న పాన్ ఇండియా మూవీ.. RRR యంగ్ టైగర్ సినీ కెరీర్ లో మైలు రాయిగా చెప్పాలి. ఈ సమయంలో వేరే సినిమాలు చేయకుండా పూర్తి సమయాన్ని RRR కేటాయించి తారక్ మంచి పని చేశారు. ఈ సినిమాకు ప్రతిష్టాత్మక ఆస్కార్ కు వెళ్లింది. దీంతో తారక్ కు మంచి పేరు వచ్చింది. ప్రస్తుతం హిట్ చిత్రాల దర్శకులు కొరటాల శివ రూపొందిస్తున్న దేవర విడుదలకు సిద్ధంగా ఉంది. ఇవి కాక బాలీవుడ్ లో వార్-2, ప్రశాంత్ నీల్ తో పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు.