Page Loader
Happy Birthday Pooja Hegde: మొదట్లో వరుస ఫ్లాపులు, ఆపై స్టార్ స్టేటస్.. బుట్టబొమ్మ సినీ ప్రయాణం ఆసక్తికరం 
హ్యాపీ బర్త్ డే పూజా హెగ్డే

Happy Birthday Pooja Hegde: మొదట్లో వరుస ఫ్లాపులు, ఆపై స్టార్ స్టేటస్.. బుట్టబొమ్మ సినీ ప్రయాణం ఆసక్తికరం 

వ్రాసిన వారు Sriram Pranateja
Oct 12, 2023
07:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

పూజా హెగ్డే.. తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన పూజా హెగ్డే, ప్రస్తుతం బాలీవుడ్ సినిమాల్లోనూ నటిస్తున్నారు. ప్రభాస్, రామ్ చరణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి స్టార్ల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా పూజా హెగ్డే మారిపోయారు. అక్టోబర్ 13వ తేదీన పూజా హెగ్డే పుట్టినరోజు ఈ సందర్భంగా పూజ హెగ్డే కెరీర్ గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. పూజా హెగ్డే మోడలింగ్ తో తన కెరీర్ ని మొదలు పెట్టారు. 2009లో మిస్ ఇండియా పోటీల్లో పూజా పాల్గొన్నారు. మొట్టమొదటగా పూజా నటించిన చిత్రం మూగమూడి (తమిళం). ఆ తర్వాత నాగచైతన్య హీరోగా ఒక లైలా కోసం సినిమాలో నటించి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.

Details

మొదట ఫ్లాపులు, ఆ తర్వాత హిట్లు 

ఒక లైలా కోసం తర్వాత వరుణ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన ముకుంద సినిమాలో పూజా హెగ్డే కనిపించింది. అయితే ఈ రెండు చిత్రాలు కూడా పూజ హెగ్డేకు తెలుగులో సరైన విజయాన్ని అందించలేకపోయాయి. ఇటు తెలుగులో సినిమాలు చేస్తున్న సమయంలోనే పూజ హెగ్డేకు బాలీవుడ్ లో అవకాశం వచ్చింది. దానితో హృతిక్ రోషన్ సరసన మొహంజోధారో చిత్రంలో పూజ నటించారు. ఈ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. మొదట్లో వరుస ప్లాపులను పూజ మూట కట్టుకుంది. ఆ ఫ్లాప్ లను దువ్వాడ జగన్నాథం సినిమా సక్సెస్ తో దూరం చేసుకుంది. పూజా హెగ్డే, అల్లు అర్జున్ నటించిన దువ్వాడ జగన్నాథం సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను వసూలు చేసింది.