హ్యాపీ బర్త్ డే రామ్ పోతినేని: దేవదాసు కన్నా ముందు రామ్ చేయాల్సిన మొదటి సినిమా ఏంటో తెలుసా?
ఈ వార్తాకథనం ఏంటి
దేవదాసు సినిమాతో తెలుగు సినిమాల్లోకి రామ్ పోతినేని ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా, బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
ఈ సినిమాతోనే తెలుగు తెరకు గోవా బ్యూటీ ఇలియానా పరిచయమైంది. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్న రామ్, ఆ తర్వాత వరుసగా రకరకాల సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు.
నిజానికి రామ్ నటించాల్సిన మొదటి సినిమా దేవదాసు కాదు. 2004లో రిలీజైన యువసేన చిత్రంతో రామ్ ని పరిచయం చేయాలని నిర్మాత స్రవంతి రవికిషోర్ అనుకున్నారు. యువసేన రీమేక్ హక్కుల్ని కొనుక్కున్నారు కూడా.
అదే టైమ్ లో దర్శకుడు వైవీఎస్ చౌదరి, స్రవంతి రవికిషోర్ ని కలుసుకున్నారట.
Details
2004లో యువసేన, 2006లో దేవదాసు
దేవదాసు సినిమా కథను రెడీ చేస్తున్న వైవీఎస్ చౌదరి, కొత్తవాళ్ళ కోసం వెతుకుతున్నాడట. నిర్మాత స్రవంతి రవికిషోర్ ఆఫీసులో రామ్ ని చూసాక, దేవదాసులో హీరోగా బాగుంటాడని ఫిక్స్ అయ్యాడట. అలా రామ్ చేతికి దేవదాసు వచ్చింది.
2006లో రిలీజైన ఈ చిత్రం, బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించింది. చక్రి అందించిన సంగీతం ఛార్ట్ బస్టర్ గా నిలిచింది.
ఇక యువసేన చిత్రం మాత్రం, అంతకంటే ముందుగానే 2004లో విడుదలైంది. ఈ చిత్రంలో శర్వానంద్, భరత్, కిషోర్, పద్మ కుమార్, గోపికా నటించారు.
అదలా ఉంచితే ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు రామ్. అలాగే పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో డబుల్ ఇస్మార్ట్ సినిమాను ప్రకటించాడు.