NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Pawan Kalyan: 'హరి హరవీరమల్లు' కొత్త విడుదల తేదీని అధికారికంగా ప్రకటించిన నిర్మాణ సంస్థ 
    తదుపరి వార్తా కథనం
    Pawan Kalyan: 'హరి హరవీరమల్లు' కొత్త విడుదల తేదీని అధికారికంగా ప్రకటించిన నిర్మాణ సంస్థ 
    'హరి హరవీరమల్లు' కొత్త విడుదల తేదీని అధికారికంగా ప్రకటించిన నిర్మాణ సంస్థ

    Pawan Kalyan: 'హరి హరవీరమల్లు' కొత్త విడుదల తేదీని అధికారికంగా ప్రకటించిన నిర్మాణ సంస్థ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 14, 2025
    09:33 am

    ఈ వార్తాకథనం ఏంటి

    పవన్‌ కళ్యాణ్ అభిమానులు, సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'హరిహర వీరమల్లు' చిత్రం మే 9న విడుదల కానుందని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది.

    పవన్‌ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్‌ అడ్వెంచర్‌ చిత్రానికి క్రిష్‌-జ్యోతికృష్ణలు దర్శకత్వం వహిస్తున్నారు.

    ఈ సినిమాను రెండు భాగాలుగా రూపొందిస్తుండగా, మొదటి భాగం చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం 'హరి హర వీరమల్లు' కొత్త విడుదల తేదీని ప్రకటించింది.

    వివరాలు 

    కొత్త పోస్టర్‌ను విడుదల చేసిన  చిత్రబృందం 

    మే 9న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా కొత్త పోస్టర్‌ను విడుదల చేస్తూ, చిత్రబృందం హోలీ శుభాకాంక్షలు తెలిపింది.

    పోస్టర్‌లో పవన్‌ కల్యాణ్‌, నిధి అగర్వాల్‌ గుర్రపుస్వారీ చేస్తూ కనిపిస్తున్నారు.

    17వ శతాబ్దం నేపథ్యంలో సాగే ఈ కథలో పవన్‌ చారిత్రాత్మక యోధుడిగా నటించగా, నిధి అగర్వాల్‌, బాబీ డియోల్, నర్గీస్‌ ఫక్రీ, నోరా ఫతేహి కీలక పాత్రలు పోషించారు.

    ఈ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ఎ. దయాకర్ రావు నిర్మిస్తుండగా, ఎ.ఎం. రత్నం సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. సంగీతాన్ని ఎం.ఎం. కీరవాణి అందిస్తున్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    నిర్మాణ సంస్థ చేసిన ట్వీట్ 

    The battle is set, and the fight for JUSTICE and DHARMA will be unstoppable! ⚔️🔥#HariHaraVeeraMallu charges into battle at breakneck speed, and NOTHING will alter the hunt this time.

    A saga of valor is all set to ignite the screens on May 9th, 2025 ❤️‍🔥💥

    A POWER-PACKED… pic.twitter.com/BOE4mmmbXY

    — Hari Hara Veera Mallu (@HHVMFilm) March 14, 2025
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హరిహర వీరమల్లు

    తాజా

    Manchu Manoj :'అత్తరు సాయిబు'గా మంచు మనోజ్.. సోలో హీరోగా రీఎంట్రీ! మంచు మనోజ్
    Virender Sehwag: పాక్‌కు మర్చిపోలేని సమాధానం అందుతుంది.. భారత సైన్యానికి సెహ్వాగ్ మద్దతు వీరేంద్ర సెహ్వాగ్
    Vikram Misri: పాకిస్థాన్‌కు ఆర్థిక సహాయంపై ఐఎంఎఫ్‌లో తన వాదన వినిపించనున్న భారత్  ఆపరేషన్‌ సిందూర్‌
    Pakistan:భారత్‌ దెబ్బ.. చిన్నాభిన్నమైన పాక్‌ ఆర్థిక వ్యవస్థ .. అప్పుకోసం అర్థిస్తూ ట్వీట్ పాకిస్థాన్

    హరిహర వీరమల్లు

    పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాను ఎన్నికలే ఆపుతున్నాయా? నిర్మాత ఏఎమ్ రత్నం క్లారిటీ  పవన్ కళ్యాణ్
    హరిహర వీరమల్లు సినిమాపై నిధి అగర్వాల్ ఎమోషనల్: వైరల్ అవుతున్న పోస్ట్  సినిమా
    Hari Hara Veera Mallu: రెండు భాగాలుగా 'హరి హర వీర మల్లు'.. ప్రకటించిన ఏఎమ్ రత్నం  సినిమా
    Hariharaveeraamllu : హరిహర వీరమల్లు పోస్టర్‌ రిలీజ్‌ చేసిన చిత్రయూనిట్‌  సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025