Page Loader
Hari Hara VeeraMallu: 'హరి హర వీరమల్లు' నిర్మాత ఆరోగ్యంపై సోదరుడు క్లారిటీ
'హరి హర వీరమల్లు' నిర్మాత ఆరోగ్యంపై సోదరుడు క్లారిటీ

Hari Hara VeeraMallu: 'హరి హర వీరమల్లు' నిర్మాత ఆరోగ్యంపై సోదరుడు క్లారిటీ

వ్రాసిన వారు Jayachandra Akuri
May 30, 2025
11:16 am

ఈ వార్తాకథనం ఏంటి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'హరి హర వీరమల్లు' చిత్ర నిర్మాత ఎ.ఎం. రత్నం స్పృహ తప్పి పడిపోయారనే వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ఈ వార్తల్లో నిజం లేదని నిర్మాత సోదరుడు దయాకర్ రావు స్పష్టంగా తెలిపారు. తన అన్నయ్య ఆరోగ్యంగా ఉన్నారని, వచ్చే రూమర్స్‌ను నమ్మొద్దని ప్రజలను కోరారు. ఈ విషయమై ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, 'అన్నయ్య ఆరోగ్యంపై వస్తోన్న పుకార్లను నమ్మకండి. ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారు. దయచేసి ఈ తరహా వదంతులను విస్తరింపజేయొద్దని తెలిపారు. పవన్ కళ్యాణ్ నటించిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా జూన్12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతోంది. షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది.

Details

పోరాట యోధుడిగా పవన్ కళ్యాణ్

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు తుదిదశకు చేరాయి. తాజాగా పవన్ తన పాత్రకు డబ్బింగ్ కూడా పూర్తి చేశారు. తన రాజకీయ, సినిమాటిక్ షెడ్యూల్‌ మధ్యలో సమయాన్ని కేటాయించిన పవన్.. రాత్రి 10 గంటలకు డబ్బింగ్ ప్రారంభించి, ఏకధాటిగా నాలుగు గంటల వ్యవధిలో పూర్తి చేసినట్టు చిత్రబృందం వెల్లడించింది. క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ పోరాట యోధుడిగా కనిపించనుండగా, నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. బాబీ దేవోల్, అనుపమ్ ఖేర్, సత్యరాజ్ వంటి ప్రముఖులు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాపై పవన్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. విడుదల తేదీ సమీపించడంతో ప్రమోషనల్ ఈవెంట్లు, ప్రెస్ మీట్లతో చిత్రబృందం వేగాన్ని పెంచింది.