
Hari Hara VeeraMallu : నేడే హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్.. టైమ్, వేదిక, గెస్టుల వివరాలు ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' చిత్రం జూలై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం పవన్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు, గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలు నెలకొనడానికి కారణమయ్యాయి. అయితే, సినిమా విడుదలకన్నా ముందు, పవన్ కళ్యాణ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ పై ఆసక్తి నెలకొంది.
Details
జులై 21న శిల్ప కళావేదికలో గ్రాండ్ ఈవెంట్
ఈ భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జులై 21న శనివారం సాయంత్రం 6 గంటల నుండి హైదరాబాద్‌లోని శిల్ప కళావేదికలో జరగనుంది. భద్రతా ఏర్పాట్ల దృష్ట్యా ఈ ఈవెంట్ పాస్‌లున్నవారికే అనుమతిని ఇవ్వనున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది. అభిమానులు భారీగా హాజరవ్వకుండా, పాస్ లేని వారు వేదిక వద్దకు రావద్దని, ఇంటి నుంచే ఈవెంట్‌ను వీక్షించాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఓ నోటిసు కూడా విడుదల చేశారు.
Details
పవన్ హాజరు ఖాయం.. ప్రముఖ అతిథుల రాక
ఈ ఈవెంట్‌కి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా హాజరవుతారని చిత్రబృందం ధృవీకరించింది. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల సినిమాటోగ్రఫీ మంత్రులు కందుల దుర్గేష్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖన్ద్రే ముఖ్య అతిథులుగా పాల్గొనబోతున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో పాటు హరిహర వీరమల్లు మూవీ యూనిట్ మొత్తం ఈ కార్యక్రమంలో పాల్గొననుంది. ఈ నేపథ్యంలో అభిమానులు ఈవెంట్‌కు ప్రత్యక్షంగా హాజరుకాలేకపోయినా, పవన్ కళ్యాణ్ ప్రసంగాన్ని టీవీల్లో, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో చూసేందుకు ఎదురు చూస్తున్నారు.