LOADING...
HariHara VeeraMallu : నేడు హరిహర వీరమల్లు ప్రెస్ మీట్.. టైం, వేదిక, పవన్ హాజరుపై ఆసక్తి!
నేడు హరిహర వీరమల్లు ప్రెస్ మీట్.. టైం, వేదిక, పవన్ హాజరుపై ఆసక్తి!

HariHara VeeraMallu : నేడు హరిహర వీరమల్లు ప్రెస్ మీట్.. టైం, వేదిక, పవన్ హాజరుపై ఆసక్తి!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 21, 2025
09:10 am

ఈ వార్తాకథనం ఏంటి

నాలుగైదేళ్లుగా రాజకీయాల బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్, తన పీరియాడికల్ చిత్రం 'హరిహర వీరమల్లు' షూటింగ్‌ను పూర్తి చేశారు. దీంతో సినిమా యూనిట్ ఇప్పుడు వేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులపై దృష్టి పెట్టింది. ఒకవైపు నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటూనే, మరోవైపు ప్రమోషన్స్‌ను కూడా ప్రారంభించింది. ఇప్పటికే టీజర్‌తో పాటు రెండు పాటలు విడుదల కాగా, ఈరోజు మూడో పాటను రిలీజ్ చేయనున్నారు. ప్రమోషన్ల భాగంగా 'హరిహర వీరమల్లు'కి సంబంధించిన తొలి ప్రెస్ మీట్‌ను కూడా ఈరోజే నిర్వహించనున్నారు. మే 21న, హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టార్ హోటల్‌లో ఈ ప్రెస్ మీట్ ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది.

Details

హీరోయిన్ నిధి అగర్వాల్ హాజరయ్యే అవకాశం

ఈ ఈవెంట్‌కు నిర్మాత ఏఎం రత్నం, దర్శకుడు జ్యోతి కృష్ణ, హీరోయిన్ నిధి అగర్వాల్ హాజరుకానున్నారని సమాచారం. అయితే పవన్ కళ్యాణ్ పాల్గొంటారా లేదా అన్నది ప్రస్తుతం అభిమానుల మధ్య చర్చకు మారింది.సాధారణంగా పవన్ కళ్యాణ్ సినిమాల ప్రమోషన్లకు పెద్దగా హాజరవ్వరు. సాధారణంగా కేవలం ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు మాత్రమే వస్తారు. ప్రస్తుతం ఆయన రాజకీయాలతో బిజీగా ఉన్న నేపథ్యంలో ఈ ప్రెస్ మీట్‌కు రాకపోవచ్చన్న అభిప్రాయం కనిపిస్తున్నా, పవన్ ప్రస్తుతం హైదరాబాద్‌లోనే OG షూటింగ్‌లో ఉన్నట్టు తెలుస్తుండటంతో ఆయన హాజరయ్యే అవకాశంపై అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. ఈ ప్రెస్ మీట్‌లో మధ్యాహ్నం 12 గంటలకు మూడో పాటను కూడా రిలీజ్ చేయనున్నట్టు సమాచారం.