LOADING...
Hari Hara Veera Mallu: 'హరిహర వీరమల్లు' ట్రైలర్.. ఎప్పుడో చెప్పేసిన ఏఎం రత్నం!
'హరిహర వీరమల్లు' ట్రైలర్.. ఎప్పుడో చెప్పేసిన ఏఎం రత్నం!

Hari Hara Veera Mallu: 'హరిహర వీరమల్లు' ట్రైలర్.. ఎప్పుడో చెప్పేసిన ఏఎం రత్నం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 02, 2025
12:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం 'హరి హర వీరమల్లు'. ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. క్రిష్‌, జ్యోతికృష్ణల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 12న విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయి. నిర్మాత ఏఎం రత్నం ఇంటర్వ్యూలు ఇస్తూ ఆసక్తికర విషయాలను వెల్లడిస్తున్నారు. తాజాగా ట్రైలర్ విషయమై మాట్లాడుతూ.. 'అభిమానులు ట్రైలర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే రెండో భాగంలో విజువల్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉండటంతో సీజీ పనులు ఎక్కువ సమయం తీసుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇవి పూర్తయిన తర్వాతే ట్రైలర్ విడుదల చేస్తామన్నారు.

Details

ట్రైలర్ రిలీజ్ కి ఇంకా సమయం కావాలి

అందుకే విడుదల తేదీని ఈ పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రకటించామని తెలిపారు. ఇక ఈ సినిమా రూపుదిద్దుకోవడానికి దర్శకుడు క్రిష్‌ కీలక కారణమని ఏఎం రత్నం చెప్పారు. 'ఈ కథను ముందుగా క్రిష్‌ చెప్పారు. ఆయన చెప్పిన లైన్‌ నాకు బాగా నచ్చింది. పవన్ కల్యాణ్‌ అయితేనే ఈ ప్రాజెక్ట్‌ బాగుంటుందని సూచించారు. అయితే కొవిడ్ కారణంగా ఆలస్యం అయింది. అనంతరం క్రిష్‌కు ఇతర ప్రాజెక్టుల కమిట్‌మెంట్‌లు ఉండటంతో ఈ బాధ్యతను మా అబ్బాయి జ్యోతికృష్ణకు అప్పగించాం. ఇది అనుకోకుండా జరిగిన మార్పే అని వివరించారు. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ట్రైలర్ రిలీజ్‌కి ఇంకా కొద్దిపాటి సమయమే మిగిలి ఉండొచ్చని స్పష్టం అవుతోంది.