Page Loader
HariHara VeeraMallu : హరిహర వీరమల్లు ట్రైలర్ రిలీజ్ కౌంట్‌డౌన్ ప్రారంభం.. ఫ్యాన్స్ కోసం భారీ సర్ప్రైజ్
హరిహర వీరమల్లు ట్రైలర్ రిలీజ్ కౌంట్‌డౌన్ ప్రారంభం.. ఫ్యాన్స్ కోసం భారీ సర్ప్రైజ్

HariHara VeeraMallu : హరిహర వీరమల్లు ట్రైలర్ రిలీజ్ కౌంట్‌డౌన్ ప్రారంభం.. ఫ్యాన్స్ కోసం భారీ సర్ప్రైజ్

వ్రాసిన వారు Jayachandra Akuri
May 29, 2025
12:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

దీర్ఘకాలంగా అభిమానుల ఎదురుచూపులకు కారణమైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పీరియాడిక్ డ్రామా 'హరిహర వీరమల్లు' ఎట్టకేలకు చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో శరవేగంగా సాగుతుంది. అన్ని కార్యక్రమాలను పూర్తిచేసి జూన్ 12న సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే చిత్రబృందం ఈ చిత్రానికి సంబంధించిన పాటలు, టీజర్, గ్లింప్స్‌ను విడుదల చేసి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసింది. దీంతో ఇప్పుడు ట్రైలర్ విడుదల కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక తాజా సమాచారం ప్రకారం హరిహర వీరమల్లు ట్రైలర్‌ను జూన్ 2న విడుదల చేయనున్నారు. అదే రోజు దుబాయ్‌లోని ప్రతిష్ఠాత్మక 'బుర్జ్ ఖలీఫా'పై ట్రైలర్ ప్రదర్శించనున్నట్లు సమాచారం.

Details

 బుర్జ్ ఖలీఫా పై ట్రైలర్

ఇప్పటి వరకు బాలీవుడ్ సినిమాల ప్రమోషన్‌ మాత్రమే అక్కడ చోటు చేసుకోగా, టాలీవుడ్ నుంచి బుర్జ్ ఖలీఫా పై ప్రదర్శించబడే తొలి ట్రైలర్ ఇదే అవుతుందన్న వార్తలున్నాయి. ఇకపోతే, పవన్ కళ్యాణ్ చేస్తున్న మొదటి పీరియాడికల్ సినిమా, అలాగే మొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమాపై మొదటి నుంచి మంచి అంచనాలే ఉన్నాయి. అంతేకాదు, పవన్ ఈ చిత్రంలో కొన్ని ఫైట్స్‌ను స్వయంగా కంపోజ్ చేయడం కూడా హైలైట్‌గా నిలుస్తోంది. ట్రైలర్ విడుదలైన తరువాత ఈ సినిమా పట్ల అంచనాలు మరింత ఎత్తుకు చేరడం ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.