Samantha: ప్రేమపై సమంత పాజిటివ్ పోస్ట్, మళ్లీ లవ్లో పడిందా?
స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె వ్యక్తిగత విషయాలు నిత్యం నెట్టింట ట్రెండ్ అవుతూనే ఉంటాయి. హీరో నాగచైతన్యను లవ్ చేసి పెళ్లి సమంతం పెళ్లి చేసుకుంది. వారిద్దరూ పరస్పర అంగీకారంతో వీడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం సామ్ సింగిల్ గానే ఉంది. అయితే తాజాగా సోషల్ మీడియాలో సమంత షేర్ చేసిన ఓ కొటేషన్ చూసి మళ్లీ అమె ప్రేమలో పడిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రేమపై తనకు అభిప్రాయాన్ని తెలుపుతూ ఓ కొటేషన్ ను సామ్ షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు సమంతకు ప్రేమ నమ్మకం పోలేదని చెప్పుకుంటున్నారు. ఈ మధ్య ప్రేమ గురించి ఇన్ స్టా స్టోరీలు తెగ పోస్టులు చేస్తోంది.
ప్రేమ విషయంలో పాజిటివ్ గా ఉన్న సమంతం
ఎక్కువ ద్వేషించే మనుషులు, ద్వేషించే మాటలను చూసి విని ఉంటావేమా కానీ ఈ ప్రపంచంలో మనం ఊహించిన దాని కంటే ఎక్కువ ప్రేమ ఉంటుంది అంటూ సమంత పోస్టు చేసింది. ఏది ఏమైనా ప్రేమ విషయంలో మాత్రం సమంత పాజిటివ్ గా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ప్రస్తుతం ఆమె తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే విహార యాత్రలతో ఎంజాయ్ చేస్తోంది. యశోద, శాకుంతలం సినిమాలు వరుసగా నిరాశపరిచగా.. ప్రస్తుతం ఆమె నటించిన ఖుషి, సిటాడెల్ ఈ ఏడాదిలో రిలీజ్ కానున్నాయి